విజయవాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మ నాభంతో పాటు సుమారు 40 మంది
కాపునాయకులను నిర్దోషులుగా ప్రకటిస్తూ విజయవాడ రైల్వే కోర్టు తీర్పు రావడం పై
వైసిపి రాష్ట్ర నాయకులు, కాపు సామాజిక వర్గ ప్రముఖులు ఆకుల శ్రీనివాస్ కుమార్
హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు ఎన్నికలలో కాపులకు బీసీ హోదా
కల్పించి వారికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ లు కల్పిస్తామని ఇచ్చిన
హామీలను నెరవేర్చాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం శాంతియుతంగా తునిలో
బహిరంగసభ ద్వారా కోరుతుంటే ఆ సభలో గందరగోళం సృష్టించి డిమాండ్ ను పక్కదారి
పట్టించడానికి ఆందోళన కారులను పోలీసులతో రెచ్చగొట్టి అనేక మంది అమాయకులుమీద
అక్రమ కేసులు బనాయించి అక్కడకి వచ్చిన వాళ్ళకు సంబంధం లేక పోయినా రైలు దగ్దం
చేసినట్లు కేసులు బనాయించి అమాయక ప్రజలను ఉగ్రవాదులుగా చిత్రీకరించడానికి
చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేశారని విమర్శించారు.చంద్రబాబు ఎన్ని అక్రమ కేసులు
పెట్టినా, ముద్రగడ పద్మ నాభం కుటుంబాన్ని ఎన్ని రకాలుగా వేధించినా చివరకు
న్యాయం స్ధానంలో చంద్రబాబు నాయుడి కుట్రలు నిలువలేక పోయాయన్నారు.ఈ తీర్పు
చూసి చంద్రబాబు ఇప్పటికైనా కాపులకు బహిరంగ క్ష మాపణ చెప్పాలని ఆకుల శ్రీనివాస
కుమార్ డిమాండ్ చేశారు.