పద్మావతి శ్రీనివాసుల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ దేవీ కరుమారి
అమ్మన్ శక్తి పీఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు ఆధ్వర్యంలో గత నెల
27 నుండి సహస్ర చండీ యాగ పూర్వక మహా కుంభాభిషేక మహోత్సవం జరుగుతున్న దరిమిలా
శక్తి పీఠం ప్రాంగణంలో జరుగుతున్న ఈ వేడుకలను వేలాదిమంది భక్తులు
తిలకించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణతో ఆ ప్రాంగణం మార్మోగింది. ఓ పక్కన
ప్రధాన యాగ శాల్లో 80 మంది ఋక్వితుల మంత్రాలు ,మరోవైపు మరో యగశాలల్లో
కుంకుమార్చన పూజలు వెరసి ఆప్రాంతమంతా ఆధ్యాత్మిక చింతన చోటుచేసుకుంది.
పూజాధికాలు పూర్తియ్యాక వేలాదిమందికి అన్నదానం నిర్వహించారు.
అమ్మవారిని దర్శించుకొన్న ఏ డి సి పి క్రైం వెంకట రత్నం
చండీ యాగం నాలుగోరోజు అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని పూజలు
నిర్వహించారు. విజయవాడ నగర ఏ డి సి పి క్రైం వెంకట రత్నం, సోమవారం ఉదయం
అమ్మవారి ని దర్శించుకోగా పీఠాధిపతులు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన
స్వాగతం పలికారు. అలాగే వెంకట రత్నం,కుటుంభ సబ్యుల గోత్ర నామాలతో ప్రత్యేకంగా
పూజలు నిర్వహించారు. శ్రీశైలంకి చెందిన వాసవీ సత్ర సముదాయాల అధ్యక్షులు దేవక
వెంకటేశ్వర్లు,కమిటీ సభ్యులు సూర్య వేణు గోపాలకృష్ణ శ్రేష్ఠి కరుమారి అమ్మన్
దర్శనానికి రాగ ఆధ్యాత్మక ప్రముఖులు కొండూరు సుందరి వారికి స్వాగతం పలికారు.
వారు శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు అశీర్వచనం పలికారు.