గుంటూరు : తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో
కార్మిక దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయ
పర్యవేక్షకులు, శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి కార్మికులతో కలసి కేక్
కట్ చేశారు. కార్మికులకు దుస్తులు, స్వీట్స్ అందచేశారు. లేళ్ళ అప్పిరెడ్డి
మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు వివరించాలంటే యువజన శ్రామిక రైతు
కాంగ్రెస్ పార్టీ అని, అంటే పార్టీ పేరులోనే శ్రామికులను చేర్చిన ఘనత తమ
పార్టీదని తెలియచేశారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన
నాటినుంచి రాష్ర్టంలో కార్మికుల జీవనప్రమాణాలు పెంచేలా నిర్ణయాలు
తీసుకుంటున్నారన్నారు. ముఖ్యంగా వారి శ్రమకు తగ్గ వేతనాలు అందేలా జగన్ పెద్ద
మనస్సుతో నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. వైయస్సార్ సిపి ప్రభుత్వం
ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేలా నిర్ణయం తీసుకోవడమే ఈ
ప్రభుత్వం కార్మిక పక్షపాత ప్రభుత్వం అనేందుకు నిదర్శనం అన్నారు. రాబోయే
కాలంలో కార్మికులంతా వైయస్సార్ సిపి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.
కార్మికులు సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రపంచం నేడు
ఇంతగా అభివృధ్ది సాధిస్తుందంటే దానికి కారణం శ్రమశక్తేనని అన్నారు. వారు
అందరికి ప్రేరణ ఇస్తున్నారని అన్నారు.