బీజేపీ ప్రజా ప్రణాళికలో 16 కీలక హామీలు
ముస్లిం రిజర్వేషన్ రద్దు ఖాయమన్న నడ్డా
బీజేపీ ‘ప్రజా ప్రణాళిక’ వెల్లడించిన పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా
బెంగళూరు : యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు, తయారీ రంగంలో పది లక్షల ఉద్యోగాలు,
బెంగళూరుకు స్టేట్ క్యాపిటల్ రీజియన్ ట్యాగ్ ఇలా కీలకమైన 16 హామీలతో
బీజేపీ కర్ణాటక ఎన్నికల కోసం మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కర్ణాటక అసెంబ్లీ
ఎన్నికలు 2023 కోసం ‘బీజేపీ ప్రజా ప్రణాళిక’ పేరిట బెంగళూరులో సోమవారం
బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
చేతుల మీదుగా మేనిఫెస్టో రిలీజ్ అయ్యింది. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై,
పార్టీ సీనియర్ బీఎస్ యడ్యూరప్ప సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఎవరికీ బుజ్జగింపుల్లేవ్ : అందరికీ న్యాయం పేరిట విజన్‌తో బీజేపీ ముందుకు
సాగుతోందని జేపీ నడ్డా మీడియాకు తెలిపారు. అంతేకాదు రాజ్యాంగానికి వ్యతిరేకంగా
అమలు అవుతున్న ముస్లింల రిజర్వేషన్‌ను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని
ప్రకటించారాయన. అంతేకాదు ప్రతీ వర్గానికి సంతృప్తి పరిచేలా మేనిఫెస్టోను
రూపొందించామని తెలిపారాయన. ఇదిలా ఉంటే ముస్లిం రిజర్వేషన్ కోటా నుంచి 4 శాతం
వెనక్కి తీసుకున్న బొమ్మై కేబినెట్ కన్నడనాట రాజకీయంగా ప్రభావం చూపే రెండు
వర్గాలకు లింగాయత్‌లకు, వొక్కలిగాస్‌కు సమానంగా పంచాలని నిర్ణయించింది. ఈ
వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నిరసనలకు దిగగా తాము
అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరిస్తామని జేడీఎస్
ప్రకటించింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో ప్రకటించింది. పేద కుటుంబాలకు
ప్రతి రోజు అరలీటరు నందిని పాలను ఉచితంగా ఇస్తామని కాషాయ పార్టీ ప్రకటించడం
ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ కర్ణాటక
రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు హామీల
వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా అధికార బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు
మేనిఫెస్టోను విడుదల చేసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు, 10లక్షల
ఉద్యోగాలు, పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కాషాయ పార్టీ హామీలు
కురిపించింది. అంతేగాక, ఇటీవల రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ‘నందిని’ పాల
బ్రాండ్‌ను కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో చేర్చడం గమనార్హం. బీజేపీ ‘ప్రజా
ప్రణాళిక’ పేరుతో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం ఈ
మేనిఫెస్టోను విడుదల చేశారు. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప తదితరులు
పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం
అందించడం, సంక్షేమం కల్పించడమే బీజేపీ విజన్ అని తెలిపారు. కాగా ప్రతిపక్ష
కాంగ్రెస్ ఇంకా తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించలేదు.
బీజేపీ మేనిఫెస్టోలోని ప్రధాన హామీలివే
కర్ణాటకలో ఉమ్మడి పౌరస్మృతి అమలు
తయారీ రంగంలో 10 లక్షల ఉద్యోగాల కల్పన
దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ప్రతి రోజు ఉచితంగా అర లీటరు నందిని
పాలు
పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం, 5 కేజీల తృణధాన్యాలతో
నెలవారీ రేషన్ కిట్
దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు
(ఉగాది, వినాయక చవితి, దీపావళికి ఒక్కోటి చొప్పున ఇస్తాం)
కర్ణాటక యాజమాన్య చట్టం సవరింపు, ప్రతి వార్డుకో లాబోరేటరీ
మైసూరులోని ఫిల్మ్ సిటీకి దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ పేరు
ప్రతి వార్డులో అటల్ ఆహార కేంద్రాలు
నిరాశ్రయులకు 10 లక్షల ఇళ్ల స్థలాల కేటాయింపు
వృద్ధులకు ఉచితంగా వార్షిక హెల్త్ చెకప్‌లు
బెంగళూరుకు స్టేట్ క్యాపిటల్ రీజియన్ ట్యాగ్
ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఫిక్స్డ్ డిపాజిట్ పథకం
రూ.30వేల కోట్లతో మైక్రో కోల్డ్ స్టోరేజీ సదుపాయాల కల్పన
రూ.1500 కోట్లతో పర్యాటక రంగ అభివృద్ధి