విజయవాడ : ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా విజయవాడ నగర వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు విశ్వనాధ రవి, వెలది అనిల్ కుమార్
ల అధ్వర్యంలో సోమవారం స్థానిక భవాని పురం లో గల ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అటో
స్టికర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన
సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ట్రేడ్ యూనియన్ జండా ఆవిష్కరించి
వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి కార్మికుల పక్షపాతి అని
అన్నారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆటో కార్మికులకు వాహన మిత్ర ఇవ్వడం
జరుగుతుందన్నారు.కార్మికులకు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు అండగా వుంటుందన్నారు.
ఎప్పుడు కార్మికులకు కర్షకులు అందరికీ నిరంతరం అండగా వుంటామని అన్నారు.మేడే
సందర్భంగా కార్మిక కర్షకలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్
రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీ, కోటి రెడ్డి, మరుపిళ్ళ
రాజేష్,మైలవరపు మాధురి లావణ్య,మైలవరపు దుర్గారావు, కొనకళ్ళ విద్యాధర
రావు,వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరక్టర్లు, పార్టీ అనుబంధ విభాగాల
అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.