హైదరాబాద్ : డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సచివాలయంలోని 6 వ అంతస్థులో కేటాయించిన
ఎఫ్ – 26 ఛాంబర్ లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్
కుమార్ ఆదివారం పూజలు నిర్వహించి కుర్చీలో ఆశీనులయ్యారు. కుటుంబ సభ్యులతో
కలిసి పూజలు నిర్వహించిన అనంతరం ప్రణాళికా శాఖా పరమైన ఫైల్ పై వినోద్ కుమార్
సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు రసమయి బాలకిషన్, వీ.
సతీష్ కుమార్, సుంకె రవి శంకర్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్
యాదగిరి సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయ, బీ.ఆర్.ఎస్.వీ. రాష్ట్ర
నాయకులు, యాదవ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల నాగరాజు యాదవ్, తదితరులు
పాల్గొని వినోద్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా నూతన సచివాలయంలోని 6 వ
అంతస్థులో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ సహా రాష్ట్ర
ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ చాంబర్స్ మాత్రమే
ఉన్నాయి.