గుంటూరు: తెలుగు సాహిత్యంలో ఎన్నో రకాల వాదాలున్నప్పటికీ అంతిమంగా కవుల
లక్ష్యం మనిషితనం, మానవత్వమేనన్నారు సుప్రసిద్ధ కవి, ఆంధ్రప్రదేశ్ ముస్లిం
రచయితల సంఘం వ్యవస్థాపకులు షేక్ కరీముల్లా. నవ్యాంధ్ర రచయితల సంఘం-డా. పట్టాభి
కళాపీఠము ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బ్రాడీపేటలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్
సమావేశ మందిరంలో శ్రీశ్రీ జయంతి-మేడే సందర్భంగా ‘కవిమిత్రుల కలయిక- కవి
సమ్మేళనం’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వచ్చిన
కరీముల్లా మాట్లాడుతూ- ప్రేమను, ప్రేమతత్వాన్ని మించిన గ్రంథం కానీ మత గ్రంథం
కానీ లేదన్నారు. ఎదుటి వ్యక్తియొక్క మనసుల్ని ముక్కలు చేయడం ప్రేమతత్వం
కాదన్నారు. నేడు సాహిత్యరంగంలో ప్రేమతత్వం కంటే ఇగోయిజమే ప్రధాన పాత్ర
పోషిస్తుందన్నారు. ముక్కలవుతున్న సమాజాన్ని కలిపికుట్టాల్సిన సాహిత్యరంగమే
దురదృష్టవశాత్తూ కులాలుగా మతాలుగా చీలిపోతున్న విపత్కర పరిస్థితుల్ని
చూడాల్సివస్తుందన్నారు. కవులు, రచయితలు కులాల దగ్గర మతాల దగ్గర
ఆగిపోకూడదన్నారు. సర్వమానవ సౌభ్రాతృత్వమే సాహిత్యం అంతిమ లక్ష్యం కావాలన్నారు.
శ్రీశ్రీ కలలు గన్న సామ్యవాదం అదేనన్నారు. సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు
చలపతిరావు మాట్లాడుతూ- తెలుగుభాష అంతరించిపోతున్న తరుణంలో కవులు, రచయితలు
భాషకోసం ఉద్యమాలు చేయాల్సి వుందన్నారు. సాహిత్య కార్యక్రమాలకు విద్యార్థులు
రాలేకపోతున్నారు కాబట్టి రచయితల సంఘాలు విద్యార్థుల దగ్గరకే కార్యక్రమాలు
తీసుకెళ్ళాలన్నారు. శ్రీశ్రీ బంధువు, రచయిత, కవి డా. రమణ యశస్వి మాట్లాడుతూ –
శ్రీశ్రీ అనే రెండక్షరాలు సమసమాజ నిర్మాణానికి ఎక్కుపెట్టిన రెండు బాణాలు..
సమాజాన్ని నిరంతరం కాపకా కాసే రక్షణకవచాలు అన్నారు. ఈ కార్యమ్రంలో
‘కాలంసాక్షిగా…’ షేక్ అబ్దుల్ హకీమ్ రాసిన అబాబీలు నూతన కవితా ప్రక్రియ
పుస్తకాన్ని సుప్రసిద్ధ కవయిత్రి షేక్ బషీరున్నీసాబేగం సమీక్షించారు. తొలుత
బండికల్లు జమదగ్ని స్వాగతం పలికిన ఈ సభకు నవ్యాంధ్ర రచయితల సంఘం గుంటూరు
జిల్లా శాఖ అధ్యక్షులు డా. తూములూరి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు.
సీనియర్ జర్నలిస్టు బండారు సురేష్ శ్రీశ్రీ రాసిన ‘కవితా ఓ కవితా’ పూర్తి
కవితను చూడకుండా చదివి సభికుల్ని ఆశ్చర్యపరిచారు. అనంతరం జరిగిన కవి
సమ్మేళనంలో షేక్ బషీరున్నీసా బేగం, తాటికోల పద్మావతి, పింగళి భాగ్యలక్ష్మి,
విజయ గోలి, అనిల్ దార్వేముల, బషీర్, ఖాదర్ బాషా, అబ్దుల్ హకీమ్ తదితర కవులు
శ్రీశ్రీ గురించి, శ్రీశ్రీ సాహిత్యం గురించి కవితలు వినిపించారు. అనంతరం
ముఖ్యఅతిధి షేక్ కరీముల్లాను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.