విజయవాడ : సేవకు మించిన భగవదారాధన ఈ లోకంలో లేదని, సేవతో లభించే
తృప్తి అనిర్వచనీయమైనదని, ప్రభుత్వం, వైద్యులు వివిధ వ్యాధులపై ప్రజలకు
అవగాహన కల్పించాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజవర్గం ఉంగుటూరు మండలం ఆత్కూరు
గ్రామంలో ఆదివారం ఉదయం స్వర్ణ భారత్ ట్రస్ట్, ఆంధ్ర హాస్పటల్ సంయుక్త
ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. గుండె,
ఎముకలు, కీళ్లు, ఊపిరితిత్తులు, సాధారణ జబ్బులు, మూత్రాశయ సమస్యలు, ఉదరకోశ
సమస్యలు, నేత్ర పరీక్షలు, దంత వైద్యం తదితర వైద్య సేవలు లభించే ఈ ఉచిత వైద్య
శిబిరాన్ని నిర్వహిస్తున్న వైద్య బృందానికి ఆయన పేరుపేరునా అభినందనలు
తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యమే
మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద
సంస్థలు సామాన్య ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్హాసక్తులు కనబరచాలన్నారు. ఉచిత
వైద్యం,ఉచిత విద్యకు ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అందుకోసం అత్యధిక
నిధులను కేటాయించాలన్నారు .
దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు ఎంతో మెరుగుపడాల్సి ఉందని మాజీ
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వాలు
ముందుకు రావాలని కోరారు. దేశంలో వైద్య విధానాన్ని కింది నుంచి పై స్థాయి వరకూ
సమూలంగా మార్చాల్సి ఉందన్నారు. దేశంలో వైద్యుల కొరతను తీర్చేందుకు వైద్య
కళాశాలల ఏర్పాటు నిబంధనలను సడలించినట్టు చెప్పారు. చేపను పట్టే గాలాన్ని
ప్రభుత్వం ఇవ్వాలి గాని, ఉచితంగా చేపను ప్రజలకు ఇస్తే, వారు స్వయంగా కష్టపడి
అర్జించే శక్తిని కోల్పోతారని ఆయన అన్నారు. మన దేశ జనాభా 140 కోట్లకు పైగా
చేరుకుందని, ఈ పరిణామం సంతోషపడాలో సంతాపపడాలో తనకి తెలియడం లేదన్నారు. 20 శాతం
మంది ప్రజలు పేదరికంలో ఉన్నారని అలాగే 18 శాతం ప్రజలు ఇప్పటికీ
నిరక్షరాస్యులుగా ఉన్నారన్నారు. ఎవరికివారు స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ
పాటించాలన్నారు.
ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామం చేయాలని, ఆరుబయట నడవడం సూర్యరశ్మి శరీరానికి
తాకితేనే కొన్ని జబ్బులు మటుమాయం అవుతాయన్నారు. ముఖ్యంగా రాత్రి పొద్దుపోయే
వరకు మొబైల్ ఫోన్ చూడడం ఆలస్యంగా నిదురించడం అనారోగ్యానికి హేతువు అన్నారు.
పర్యావరణాన్ని కాపాడే పచ్చని మొక్కలను నాటడం ద్వారా పరిసరాలలో ఆహ్లాదకర
వాతావరణం పెంపొందించవచ్చన్నారు. పాశ్చాత్య ఆహారపు అలవాట్లను వీడి భారతీయ
సంప్రదాయ వంటకాలపై దృష్టి సారించాలని సూచించారు. పాశ్చాత్య పోకడల
కారణంగా ఆరోగ్యాన్ని యువత ప్రమాదంలో పడవేసుకుంటోందని, నిల్వ ఉంచిన
ఆహారాన్ని ప్యాకెట్ల ద్వారా ఆర్డర్ చేసుకొని అదే బలవర్ధకమైన ఆహారమని చాలామంది
భావిస్తున్నారని, ఇన్స్టంట్ ఫుడ్ ఖచ్చితంగా కాన్ స్టెంట్ డీసీస్ కు మూల
కారణమవుతుందని అందరూ తప్పక గుర్తుపెట్టుకోవాలన్నార. తెల్లని అన్నం అనేక
రోగాలకు కారణం అవుతుందని, దంపుడు బియ్యం, ముడి బియ్యం, రాగులు సజ్జలు జొన్నలు
అరికెలు సామలు వంటి చిరు ధాన్యాలను ఆహారంగా ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు.
దేశానికి భవిష్యత్తు అయిన యువత ఆరోగ్యంగా ఉంటేనే భావిభారతం బాగుంటుందిని
ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఉచిత శిబిరానికి పలు ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది
మంది రోగులకు వైద్య సేవలు అందించడంతోపాటు భోజన వసతిని స్వర్ణ భారత్ ట్రస్ట్
నిర్వహకులు కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రివర్యులు
డాక్టర్ కామినేని శ్రీనివాస్, డాక్టర్ సి వి రావు, ఆంధ్రా హాస్పిటల్స్
వైద్యులు డాక్టర్ జె. శ్రీమన్నారాయణ ( కార్డియాలజిస్ట్), డాక్టర్ ప్రశాంత్(
న్యూరాలజిస్ట్), డాక్టర్ పూజిత, డాక్టర్ ఎం. రవీంద్రనాథ్, డాక్టర్ నవ కిరణ్,
విజయవాడ శంకర్ నేత్రాలయ తరపున ఆప్తమాలజీ నిపుణులు డాక్టర్ స్వాతి, డాక్టర్
సునీల్, డాక్టర్ మస్తాన్ వలి ( డెంటిస్ట్), ట్రస్ట్ తరపున విశ్వనాథ్, ప్రసాద్
తదితరులు పాల్గొన్నారు.