సీఎం ఆఫీస్ ఆరో అంతస్తులో
హైదరాబాద్ : సువిశాల 28 ఎకరాల విస్తీర్ణంలో ఆరంతస్తుల్లో నిర్మితమైన తెలంగాణ
ప్రజాసౌధంలో కార్యాలయాలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి,
మంత్రులకు సంబంధించిన ఛాంబర్లు అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్నాయి. ఆరో
అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన సీఎం కార్యాలయం
మంత్రుముగ్ధుల్ని చేస్తుండగా.. సమావేశాలు, సందర్శకుల కోసం ప్రత్యేక హాళ్లు
కేటాయించారు. ఉన్నతాధికారులు, ఉద్యోగులకు ఆహ్లాద భరితమైన విశాలమైన గదులు,
ఛాంబర్లు, వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.