హైదరాబాద్ : రాష్ట్ర నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఇవాళ వైభవంగా జరగనుంది.
మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల సమక్షంలో వేద మంత్రోచ్ఛారణల
మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్.. మధ్యాహ్నం సమీకృత సచివాలయ కొత్త భవనాన్ని
ప్రారంభించనున్నారు. ప్రజాకోణంలో కీలకమైన అంశానికి సంబంధించిన దస్త్రంపై సంతకం
చేసి కొత్త కార్యాలయంలో తన విధులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుడతారు. మంత్రులు,
అధికారులు సీఎంను అనుసరించనున్నారు. అనంతరం నూతన సచివాలయం వేదికగా నేతలు,
అధికారులకు సీఎం కేసీఆర్ లక్ష్య సాధన దిశగా మార్గనిర్దేశం చేయనున్నారు.