మన శరీరంలోని కండరాలు, చర్మం వంటి మెత్తటి కణజాలం మరణానికి కారణమయ్యే
ఇన్ఫెక్షన్. సరిగ్గా చెప్పాలంటే కణజాలాన్ని తినేసే ‘నెక్రోటైజింగ్ ఫాసిటిస్’
ఇన్ఫెక్షన్. అరుదుగా వచ్చే ఈ ఇన్ఫెక్షన్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. సోకిన
కొద్ది గంటల్లోనే శరీరంలోని చాలా భాగానికి విస్తరిస్తుంది. గ్రూప్ ఏ
స్ట్రెప్టోకాకస్, క్లెబసెల్లా, క్లొస్ట్రిడియం, ఎస్చెరిచియా కొలి,
స్టఫిలోకాకస్ ఆరస్ వంటి బ్యాక్టీరియాలు దీనికి కారణమవుతాయి. వీటినే ‘ఫ్లెష్
ఈటింగ్ బ్యాక్టీరియా (మాంసాన్ని తినేసే బ్యాక్టీరియా)’లు అంటారు. ఇందులోనూ
స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా అత్యంత ప్రమాదకరం.
డ్రైనేజీలు, వాటి కలుషితాలు, అపరిశుభ్ర ఆస్పత్రి పరిసరాలు ఈ ‘ఫ్లెష్
ఈటింగ్ బ్యాక్టీరియా’కు నిలయాలు. పలు చోట్ల డ్రైనేజీల నీరు నేరుగా నదులు,
వాగులలోకి కలుస్తుంది. అటువంటి చోట వాటిల్లోని నీటిని పంటలకు
వినియోగిస్తుంటారు. దానివల్ల అక్కడ పనిచేసేవారికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు
ఎక్కువ.బ్యాక్టీరియా కారణంగా రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. దీంతో రక్తం సరఫరా
నిలిచిపోతుంది. దీనివల్ల అక్కడి కణజాలంతోపాటు ఆ రక్తం సరఫరా కావాల్సిన శరీర
భాగాలు కూడా దెబ్బతింటాయి
ఇన్పెక్షన్ సోకితే.. వెంటనే చర్మంపై చిన్న పాటి కురుపులు, దద్దుర్లు వంటివి
వస్తాయి. దీనికితోడు చెమట పట్టడం, వాంతులు, జ్వరం, తీవ్రమైన నొప్పి వంటివి
ఉంటాయి. ఈ బ్యాక్టీరియా చాలా వేగంగా విస్తరించే లక్షణం ఉండడం వల్ల.. కొద్ది
గంటల్లోనే ఇన్ఫెక్షన్ లక్షణాలు పెరిగిపోతాయి. ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతంలో వాపు
వస్తుంది. మెల్లగా చర్మం, దాని కింద కణజాలం నల్లగా మారిపోతుంటుంది. విపరీతంగా
నొప్పి ఉంటుంది.

ఇన్ఫెక్షన్ సోకిన భాగాల్లో విడుదలయ్యే రసాయనాలు రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా
శరీరమంతా వ్యాపించడం వల్ల ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి. దీనివల్ల బాధితులు
కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది.ఈ ఇన్ఫెక్షన్ ను గుర్తిస్తే.. వెంటనే
శస్త్రచికిత్స చేసి, అది సోకిన భాగాన్ని అంతా తొలగించాల్సి ఉంటుంది.
అప్పటికే ఇన్ఫెక్షన్ సోకి.. దెబ్బతిన్న భాగాలను పునరుద్ధరించడం మాత్రం సాధ్యం
కాదు. ఈ చికిత్సలో చర్మాన్ని తొలగించడం వల్ల.. శరీరంలోని ఇతర భాగాలపై
(ముఖ్యంగా తొడలపై) చర్మాన్ని తీసుకుని, తొలగించిన స్థానంలో అమర్చుతారు.
ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఇన్ఫెక్షన్ బాధితులు ఉంటున్నారు.