గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రతి సమస్య పరిష్కారం అయ్యేలా ఏపీ జేఏసీ
అమరావతి కృషి * రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో గ్రామ వార్డు సచివాలయ
ఉద్యోగుల సమస్యల పై ధర్నా విజయవంతం * ఏపి జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు
వెంకటేశ్వర్లు
విజయవాడ : ఏపీ జేఏసీ అమరావతి రెండో విడత ఉద్యమ కార్యాచరణ లో భాగంగా శనివారం
ఏపీ జేఏసీ అమరావతి కృష్ణ జిల్లా అధ్వర్యంలో మచిలీపట్నం జిల్లా కలెక్టరేట్ వద్ద
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల మీద ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ
ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపి జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు
వెంకటేశ్వర్లు, ఏ ఐ టి యు సి రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్ర నాథ్
హాజరయ్యి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఎదుర్కొంటున్న సమస్యల పై
మాట్లాడారు. అలాగే ఉద్యమానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. గ్రామ
వార్డు సచివాలయ ఉద్యోగుల మొదటి విడతలో కోల్పోయిన 9 నెలల కాలానికి మరియు రెండో
విడత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కోల్పోయిన ఐదు నెలల కాలానికి సంబంధించిన
ఆర్థిక, ఆర్థికేతర అంశాలకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. రెండు
సంవత్సరాలకు దాటి 9 నెలల తర్వాత ప్రొబేషన్ డిక్లేర్ చేసినందున, వెంటనే గతంలో
టీచర్లకు ఇట్చినట్లే నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలన్నారు. గ్రామ వార్డు
సచివాలయ ఉద్యోగులకు వెంటనే సాధారణ బదిలీలు కల్పించాలని, కేవలం మ్యూచువల్,
స్పాస్ కోటా , దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మాత్రమే
బదిలీల అవకాశం కల్పించడం వల్ల అనేక మంది ఉద్యోగస్తులు నష్టపోయే ప్రమాదం
ఉందన్నారు. ఎపిజిఎల్ఐ బాండ్లు వెంటనే జారీ చేయాలని, గత తొమ్మిది నెలల కాలంగా
జీతాలు నుంచి డబ్బులు కట్టవుతున్నా ఇంతవరకు బాండ్లు జారీ చేయలేదని, వెంటనే
అవి జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా సంరక్షణ
కార్యదర్శులుగా నియామకం అయిన ఉద్యోగినులు మహిళా సంరక్షణ కార్యదర్శి గా
పనిచేయలా, లేక మహిళా పోలీసు గా పనిచేయాలా అనే ఆప్షన్ వారికే వదిలిపెట్టాలని,
వారికి పోలీసు బందోబస్తు డ్యూటీలు, స్టేషన్ డ్యూటీలు వేయడం వల్ల వారు
తీవ్ర మానసిక నైరాస్యానికి గురవుతున్నారని, వారికి పోలీసు విధులు
కేటాయించవద్దన్నారు. సిపిటి పరీక్షలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల పంచాయతీ
కార్యదర్శి గ్రేడ్ 5 దాదాపు 500 మందికి మరియు విఆర్ఓ గ్రేటు 2 దాదాపు 1700
మందికి ప్రొఫెషన్ డిక్లేర్ కాలేదని వారికి సకాలంలో సీపీటీ పరీక్షలు నిర్వహించి
ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని డిమాండ్ చేశారు. వార్డు ఎన్విరాన్మెంటల్,
శానిటేషన్ సెక్రటరీలకు మేస్త్రి డ్యూటీ నుండి విముక్తి కలిగించి వారికి కూడా
గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు మాదిరి పని వేళలు కల్పించాలని తెలిపారు.
పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 వారికి జీవో నెంబర్ 149 అమలుపరచి డి డి వో
అధికారాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎం లకు యాప్ ల భారం తగ్గించి
సానుకూల వాతావరణం లో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని, గ్రామ వార్డు
సచివాలయ ఉద్యోగులకు యూనిఫామ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత తొమ్మిది నెలల
నుండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాల నుండి సిపిఎస్ అమౌంట్ కట్ అవుతున్న
ఇంతవరకు వాళ్ళ ఖాతాలో జమ చేయలేదని వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని
తెలియజేశారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా
ప్రాసెసింగ్ సెక్రటరీలకు, వెల్ఫేర్ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఛానల్ ని
కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
ఉద్యోగం చేస్తూ గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఉద్యోగం పొంది ఉద్యోగంలోకి మారిన
తర్వాత ఆ ఉద్యోగికి పే ప్రొటెక్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇవే
కాకుండా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలన్నిటిని ప్రభుత్వ దృష్టికి
తీసుకెళ్లి ప్రతి సమస్యకు పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఏపీ
జేఏసీ అమరావతి పక్షాన తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులు అడిగిన
ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ గత 52 రోజులుగా ఎంతో ఓపికతో, సంయమనంతో ఉద్యోగుల
ఉపాధ్యాయుల, కార్మికుల, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్
ఉద్యోగుల సంపూర్ణ సహకారంతో విజయవంతంగా నడుపుతున్నప్పటికీ, తేదీ 27.4.2023న
జరిగిన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం కేవలం అనధికారిక సమావేశం కాబట్టి, అందులో
కేవలం మాటల హామీలే తప్ప ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వలేదని, రౌండ్
టేబుల్ సమావేశం లో పాల్గొన్న ఏపీ ఎన్జీవో జేఏసీ వారి అనుబంధ సంఘాలు, టీచర్
సంఘాలు, సీఐటీయూ రాష్ట్ర నాయకత్వం వారి అనుబంధ సంఘాలు, రాష్ట్ర నాయకత్వం,
వారి అనుబంధ సంఘాల సంపూర్ణ మద్దతుతో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర సెక్రటేరియట్
సమావేశం నిర్వహించుకుని, మూడవ దశ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ
కార్యక్రమంలో ఏ ఐ టి యు సీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, వీ ఆర్
వో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొన ఆంజనేయ కుమార్, ప్రధాన కార్యదర్శి
ఏ.సాంబశివ రావు, క్లాస్ ఫోర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యస్. మల్లేశ్వర
రావు, ఏపీ జేఏసీ అమరావతి కృష్ణ జిల్లా చైర్మన్ టీ వీ సతీష్, ప్రధాన కార్యదర్శి
వై. వీ రావు, కోశాధికారి విజయ్ కుమార్, కృష్ణ జిల్లా రెవెన్యూ సర్వీసెస్
విభాగం ప్రధాన కార్యదర్శి శ్యామ్ నాథ్, సత్యనారాయణ, గ్రామ వార్డు సచివాలయ
ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. జ్యోతి , కోశాధికారి జగదీష్
తదితరులు పాల్గొన్నారు.