నగరంలో బైక్ ర్యాలీతో సందడి సృష్టించిన యువకులు
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ పథకాల విజయోత్సవంతో వైసిపి రాష్ట్ర నాయకులు ఆకుల
శ్రీనివాస్ కుమార్ నాయకత్వంలో యువకులు బైక్ ర్యాలీతో నగరంలో సందడి చేశారు.
ఆకుల శ్రీనివాస్ నాయకత్వంలో దాదాపు 500 బైకులతో యువకులు జై జగన్ అంటూ నగర
వీధుల్లో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నా మీరే మా నమ్మకం- మీరే మా భవిష్యత్ కార్య
క్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నలబై లక్షల కుటుంబాలు ఒకే మాటగా జగన్
మోహన్ రెడ్డికి అండగా నిలిచినందుకు విజయోస్తవ బైక్ ర్యాలీ విజయవాడలో చేపట్టడం
జరిగింది. ముందుగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో నగరంలోని
మూడు నియోజకవర్గాల్లోనీ కాంగ్రెస్, టిడిపి,జనసేన పార్టీలకు చెందిన షుమారు 250
మంది ఆకుల శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ లో చేరారు. వారికి
జిల్లా అధ్యక్షులు, పశ్చిమ నియోజక వర్గం ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు,
సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని
అవినాష్ లు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆనంతరం
కార్యకర్తలను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్
రెడ్డి చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పధకాలను చూసి జగన్ వల్లే రాష్ట్ర
అభివృద్ధి సాధ్యమని గమనించి అనేక మంది పార్టీలోకి వస్తున్నారని తెలియ చేశారు .
ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టి వర్గాలను, వారి పిల్లల భవిష్యత్తుకు, వారి
చదువులుకు భరోసా కలిగేలా పరిపాలన ఉందని గ్రహించారని తెలియ చేశారు . ఎమ్మెల్యే
మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆకుల శ్రీనివాస కుమార్ ఆధ్యర్యంలో వివిధ పార్టీలకు
చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలోకి రావడం శుభపరిణామమని అన్నారు. ఈ
కార్యక్రమంలో నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్య లక్ష్మి ,తూర్పు నియోజకవర్గ
ఇంచార్జి దేవినేని అవినాష్, అడపా శేషగిరి, బాషా, కార్పొరేటర్లు హర్షద్,యలకల
చలపతిరావు, యరడ్ల అంజనేయ రెడ్డి, షేక్ ఇర్ఫాన్, బి కోటి రెడ్డి తదితరులు
కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని ఆహ్వానించారు. ఆనంతరం ఆకుల శ్రీనివాస
కుమార్ నాయకత్వంలో జిల్లా వైఎస్సార్ పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున బైక్
ర్యాలీ నిర్వహించి రథం సెంటర్ మీదగా కంట్రోల్ రూం దగ్గరకు చేరుకుని వైఎస్సార్
విగ్రహం కు,అంబేత్కర్ విగ్రహం కు పూల దండలు వేసి పూజాకార్య క్రమం నిర్వ
హించారు. ఆనంతరం నగరంలొ ఉన్న కొంత మంది వి.యం. రంగా యువసేన నాయకులతో కలసి
సీతన్న పేటలో ఉన్న వంగవీటి రంగా విగ్రహం దగ్గరకు ఆకుల శ్రీనివాస్ కుమార్
వెళ్ళి పూల దండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పొదిలి
చంటి బాబు, సలీంఫర్వేజ్,అల్లం పూర్ణచంద్రరావు, సుంకర శ్రీను (కబాడి శ్రీను) ,
యరజర్ల మురళి, ఏలూరు వెంకన్న, పోతిరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.