5వేల మంది భక్తులకు అన్నదానం
విజయవాడ : సహస్ర చండీ యాగం ప్రాంగణం శుక్రవారం వేలాదిమంది భక్తులతో
పోటెత్తింది. సి వి ఆర్ ప్లై ఓవర్ బ్రిడ్జి పక్కనున్న శ్రీ దేవీ కరుమారి
అమ్మన్ శక్తి పీఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కరుణ దాసు ఆధ్వర్యంలో సహస్ర చండీ
యాగం ప్రారంభమైన విషయం విదితమే. భక్తుల తాకిడి ఎక్కువైంది. చండీ యాగంలో 80
మంది ఋక్వితుల మంత్రోచ్ఛరణతో యాగం ప్రాంగణంలో వేదమంత్రాలు మార్మోగాయి. అనంతరం
కల్యాణ వేదికపై ఉభయ దాతలతో సిద్ధి బుద్ది సమేత గణపతి కల్యాణం అత్యంత భక్తి
శ్రద్ధలతో జరిగింది. నగరానికి చెందిన ప్రముఖులు చలవాది ప్రకాష్ దంపతులు,
గజ్జరపు సుహాసిని కుటుంభం, వైజాగ్ కి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఆర్ వి
కే నాయుడు దంపతులు, తదితరులు ఉభయ దాతల పూజల్లో పాల్గొన్నారు. మాస్ట్రో గజల్
శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో జరుగుతున్న ఈ మహోత్తర వేడుకలు కానీ వినీ ఎరుగని
రీతిలో భక్తులు పోటెత్తారు. అలాగే సహస్ర మహా చండీ 72 అడుగులుఎత్తులో చూసిన
భక్తులు పరవశించి పోతున్నారు. చండీ పీఠం వద్ద ఏర్పాటు చేసిన కళా వేదికపై నగర
వైసీపీ మహిళా మాజీ కన్వీనర్ లఖంరాజు సునీత వ్యాఖ్యాతగా వ్యవహరించగా సాంస్కృతిక
కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ వేడుకలు వద్ద సుమారు 5 వేల
మంది కి అన్నదానం నిర్వహించారు.శక్తి పీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ కరుమారి
దాసు,ఉత్సవ కమిటీ కోశాధికారి జ్ఞానేశ్వర్, కమిటీ సబ్యులు వై వి నాగేందర్,
చంద్రకళ, శివ,సాయి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.