బోర్డు (బీసీసీఐ) విడుదల చేసింది. 17 మంది మహిళా క్రికెటర్లకు బీసీసీఐ
కాంట్రాక్ట్‌లు దక్కాయి. ఈ 17 మందిని మూడు గ్రేడ్లుగా (గ్రేడ్ A, గ్రేడ్ B
మరియు గ్రేడ్ C) విభజించింది. ‘2023-24 సీజన్ కోసం భారత్ సీనియర్ మహిళల
వార్షిక ప్లేయర్ కాంట్రాక్ట్‌లను బీసీసీఐ ప్రకటించింది’ అని భారత క్రికెట్
బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే మహిళా క్రికెటర్లకు చెల్లించే వేతన
వివరాలను బీసీసీఐ వెల్లడించలేదు. కేవలం మూడు గ్రేడ్లకు సంబంధించి ప్లేయర్స్
పేర్లను ప్రకటించింది.
భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతీ
మంధాన, ఆల్‌రౌండర్ దీప్తి శర్మలు గ్రేడ్ A కాంట్రాక్ట్‌లో ఉన్నారు. బీసీసీఐ ఈ
ముగ్గురికి మాత్రమే టాప్ గ్రేడ్‌ను కేటాయించడం విశేషం. గతేడాది ప్రకారం రూ.
50 లక్షలు వార్షిక వేతనంగా చెల్లించారు. అయితే ఈసారి వేతనం పెరిగే అవకాశాలు
ఉన్నట్లు తెలుస్తోంది. రేణుకా సింగ్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా
ఘోష్, రాజేశ్వరి గైక్వాడ్‌లకు గ్రేడ్ B కాంట్రాక్ట్‌లో చోటు దక్కింది.
గ్రేడ్ Bలో ఐదుగురు ప్లేయర్లు ఉన్నారు. గతేడాది గ్రేడ్ B ప్లేయర్లు రూ. 30
లక్షలు చెల్లించారు.
గ్రేడ్ C కాంట్రాక్ట్‌లో 9 మందికి బీసీసీఐ చోటిచ్చింది. సబ్బినేని మేఘన,
అంజలి సర్వాని, మేఘ్నా సింగ్, దేవికా వైద్య, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా,
రాధా యాదవ్, హర్లీన్ డియోల్, యస్తికా భాటియా గ్రేడ్ C కాంట్రాక్ట్
జాబితాలో ఉన్నారు. ఈ గ్రేడ్‌లో ఉన్నవారికి గతేడాది వార్షిక వేతనం రూ. 10
లక్షలుగా ఉంది. పురుషుల, మహిళల మ్యాచ్ ఫీజులను సమానంగా చెల్లిస్తామని బీసీసీఐ
పెద్దలు అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే వేతనాలు మాత్రం చాలా వ్యత్యాసంగా
ఉన్నాయి. పురుష టాప్ గ్రేడ్ A+ కేటగిరీలో ఉన్నవారికి రూ. 7 కోట్ల వేతనం
అందుతుంది. గత మార్చిలో పురుషుల జట్టు వార్షిక కాంట్రాక్టులను బీసీసీఐ
ప్రకటించింది.