నిర్మించిన ఈ సినిమాతో, కథానాయికగా సాక్షి వైద్య పరిచయమైంది. సురేందర్ రెడ్డి
సినిమాల్లో ఆయన మార్క్ యాక్షన్ ఉంటుంది. ఇక అఖిల్ కి కూడా యాక్షన్ పాళ్లు
ఎక్కువగా ఉన్న సినిమాలంటే ఇష్టం. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన ఈ
సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేసి వదిలిన ఈ
సినిమా, ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది ప్రశ్నే.
రామకృష్ణ (అఖిల్) ఓ మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన యువకుడు. ‘రా’లో చేరాలనేది
అతని కోరిక .. ఆ విషయం గురించే అతను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. అదే పనిగా కలలు
కంటూ ఉంటాడు. కూరగాయలు చూసినా అతనికి గన్స్ .. బుల్లెట్స్ లా కనిపిస్తూ
ఉంటాయి. ‘రా’లో చేరిపోయి ఒక రేంజ్ లో యాక్షన్ లో చెలరేగిపోవాలనేది తన కోరిక.
అందుకోసం అతను వేసిన ఒక ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ‘రా’ చీఫ్ మహాదేవ్
(మమ్ముట్టి) అతనికి ఒక ఆపరేషన్ అప్పగించేలా చేస్తుంది.
ప్రపంచదేశాలలో తన అక్రమ వ్యాపారాలను విస్తరింపజేసే ‘గాడ్’ (డినో మోరియా)కి
సంబంధించిన ఆపరేషన్ అది. ‘గాడ్’ అక్రమాలకు చెక్ పెట్టడానికి సరైనవాడు
రామకృష్ణ అని భావించిన మహాదేవ్, అతణ్ణి రంగంలోకి దింపుతాడు. అయితే ఈ విషయాన్ని
సీక్రెట్ గా ఉంచడమే కాకుండా, అతను ప్రేమిస్తున్న వైద్యను వదిలేయాలని చెబుతాడు.
ప్రియురాలు ఒకవైపు. తాను ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ వస్తున్న ‘రా’లో అవకాశం
మరో వైపు. అప్పుడు రామకృష్ణ ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది?
ఎలాంటి అనూహ్యమైన మలుపులు చోటుచేసుకుంటాయి? అనేది కథ.
హీరోను స్టైలీష్ గా చూపించడంలో సురేందర్ రెడ్డికి మంచి పేరు ఉంది. యాక్షన్
సినిమాలపై తనదైన మార్క్ కనిపిస్తుంది.ఈ సినిమాలోనూ ఉండి ఉంటాయని భావించి
సినిమాకి వెళ్లినవారికి నిరాశ తప్పదు.
అఖిల్ లుక్ ను .. ఆయన పాత్రను సురేందర్ రెడ్డి సరిగ్గా డిజైన్ చేయలేదు.
‘నాసా’లో జాబ్ చేయాలనే స్థాయికి ఎలా వచ్చిందనేది తెలియదు. అసలు ఆమె
కనిపించకుండానే కథ చాలా వరకూ నడుస్తుంది.
హీరో పాత్రను గానీ .. విలన్ పాత్రను గానీ .. ‘రా’ చీఫ్ పాత్రను గాని
పర్ఫెక్ట్ గా మలచలేకపోయారు. ఈ మూడు పాత్రలు మినహా మిగతా పాత్రలన్నింటినీ డమ్మీ
చేసి వదిలిపెట్టారు. ఇలా నానా అవస్థలు పడుతూ ఆడియన్స్ ను క్లైమాక్స్ వరకూ
తీసుకుని వెళ్లారు. అప్పటికి కూడా ఇది సురేందర్ రెడ్డి సినిమానేనా? అఖిల్ ఈ
కథను ఎలా ఒప్పుకున్నాడు? అనే ఒక సందేహం మనసును తొలిచేస్తూనే ఉంటుంది.
రసూల్ ఎల్లోర్ ఫొటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీన్స్ .. ఛేజింగ్ సీన్స్ ను
గొప్పగా చిత్రీకరించాడు.