సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.2 లక్షలు ఆర్థిక సహాయం
ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా
కడప : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లో మైనారిటీ సంక్షేమానికి
పెద్ద పీట వేసి మైనారిటీల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి అనేక సంక్షేమ
పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేయడం జరుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,
మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి అంజాద్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం ఉప
ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్ భాష నివాస
కార్యాలయంలో హజ్రత్ బావా సాహెబ్ మియా మజ్జిద్ నిర్మాణానికి రూ.3 లక్షలు చెక్కు
ను మజ్జిద్ కమీటీ సభ్యులకు ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి
అంజాద్ భాష చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి, మైనార్టీ
సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ భాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
ప్రభుత్వం లో మైనారిటీ సంక్షేమానికి పెద్ద పీట వేసి మైనారిటీల సంక్షేమానికి,
ఆర్థికాభివృద్ధి కి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేయడం
జరుగుతోందని, ప్రతి పేద ముస్లిం మైనారిటీలు సంక్షేమ పథకాలను తెలుసుకుని
ప్రయోజనం పొందాలని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం నగరంలో ని షాహిపేట నందు గల
హజ్రత్ బావా సాహెబ్ మియా మజ్జిద్ నిర్మాణానికి వక్ఫ్ బోర్డ్ ఫండ్ నుండి రూ.3
లక్షల చెక్కును షాహిపేట నందు గల హజ్రత్ బావా సాహెబ్ మియా మజ్జిద్ కమిటీ
సభ్యులకు ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ భాష చేతులమీదుగా
అందచేశారు. అలాగే కడప నగరం మాసాపేట కు చెందిన బందెళ్ల ఓబులేసు, రోజమని దంపతుల
కుమారుడు కరుణాకర్ (20 సం. లు) ప్రమాదవశాత్తు పులివెందుల డ్యామ్ నందు పడిపోయి
చనిపోయాడని ఆర్థిక సహాయం కొరకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ
మంత్రి అంజాద్ భాష ఆశ్రయించగా ఆయన స్పందించి ముఖ్యమంత్రి తో మాట్లాడి సీఎం
రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయం కింద రూ.2 లక్షలు మంజూరు చేయించి, రూ.2 లక్షలు
చెక్కును అంజాద్ భాష చేతుల మీదుగా లబ్ధిదారులకు అందచేశారు. ఇందుకు లబ్ధి
పొందిన లబ్ధిదారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలకాలం ఆయనే ముఖ్యమంత్రిగా
ఉండాలని, అలాగే ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష కూడా భవిష్యత్తులో మళ్లీ మళ్లీ ఉప
ముఖ్యమంత్రిగా పదవులను పొంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవలందించాలని ఆ
దేవున్ని ప్రార్థిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హజ్రత్ బావా సాహెబ్
మియా మజ్జిద్ కమిటీ ప్రెసిడెంట్ అబిడ్ మియా, జనరల్ సెక్రెటరీ మహబూబ్ ఖాన్,
మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఇబ్రహీం మియా, కార్పొరేటర్లు షేక్ మహమ్మద్ షఫీ,
బసవ రాజు, బండి ప్రసాద్, వైసీపీ నాయకులు సుబాన్ బాషా, నరపు రెడ్డి సుబ్బా
రెడ్డి, తోట కృష్ణ, అహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.