మీ ఉద్యమానికి మేమంతా అండగా ఉంటాం * రౌండ్ టేబుల్ సమావేశంలో ముక్తఖంటంతో
మద్దతు పలికిన ఏపీ ఎన్జీవో జేఏసీ, ఉపాద్యాయులు, పెన్షనర్లు, ప్రధాన ట్రేడ్
యూనియన్ నాయకులు * ఉద్యోగుల మేలు కోసం జరిగే ఈ పోరాటంలో మనమంతా కలిసే
పనిచేద్దాం * ఏపిజెఏసి చైర్మన్ బండి శ్రీనివాసరావు, సెక్రటరీ జెనరల్
జి.హృదయరాజు
విజయవాడ : ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాంఢ్లు పరిష్కరించాలని, గత 50
రోజులుగా ఏపీ జేఏసీ అమరావతి చేస్తున్న పోరాటాలకు అభినందనలు తెలియజేయడమే
కాకుండా భవిష్యత్ లో చేపట్టబోవు ఉద్యమం ఏదైనా సరే అందరం కలిసి పని చేద్దామని
తీర్మానించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమే ద్యేయంగా పని
చేద్దామని శుక్రవారం ఏపిజెఏసి అమరావతి రాష్ట్ర కమిటి ఆద్వర్యంలో విజయవాడలో
రౌండుటేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఏపిజెఏసి చైర్మన్ బండి
శ్రీనివాసరావు, సెక్రటరీ జెనరల్ జి.హృదయరాజు, ఏపియన్జీఓ అసోషియేషన్
రాష్ట్రప్రధానకార్యదర్శికె.వి. శివారెడ్ఢి తోపాటు ఏఐటియుసి రాష్ట్ర
ప్రధానకార్యదర్శి జి.ఓబులేషు, సిఐటియు రాష్ట్రప్రధానకార్యదర్శి
సిహెచ్.నర్శింగరావు తో పాటు వారి అనుబంద కార్మిక సంఘాలు నాయకులు, ప్రధాన
ఉపాద్యాయ సంఘాలు యుటియఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, యస్టియు
రాష్ట్ర అధ్యక్షులు సాయిశ్రీనివాస్, విధ్యుత్, అంగన్ వాడి, అషా, కాంట్రాక్టు,
ఔట్ సోర్శింగ్ సంఘనాయకులు, పెన్షనర్ (రిటైర్డు) సంఘాల నాయకులతోపాటు ఇతర
సంఘాల నాయకులు రౌండుటేబుల్ సమావేశంలో సంపూర్ణ మద్దతు ప్రకటించారని ఏపిజెఏసి
అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, జెనరల్ సెక్రటరీ పలిశెట్టి
దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వి.వి.మురళి
కృష్ట నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ యస్.కృష్టమోహన్, పబ్లిసిటీ సెక్రెటరీ
బి.కిషోర్ కుమార్ తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చిన అభిప్రాయలను
పరిగణలోకి తీసుకుంటు భవిష్యత్ కార్యచరణను ఆదివారం ప్రకటిస్తామని వారు
తెలిపారు. ఉద్యోగులు సమస్యలపై పోరాటాలు చేసిన దివంగత నే లు అమనగంటి
శ్రీరాములు, తోట సుధాకర్ ప్రసాద్ లాంటి గత చరిత్రలను గుర్తించి భవిష్యత్
తరాలకు ఆదర్శంగా ఉండే విదంగా భవిష్యత్ లో ప్రభుత్వాలు ఏమున్నాసరే ఉద్యోగుల
సమస్యల పరిష్కారంలో భవిష్యత్ లో ఉద్యోగులపై నిర్లక్ష్య ధోరణి అవంభించకుండా
ఉండేలా పోరాటాలు రూపుదిద్ది ముందుకు నడవాలని రౌండుటేబుల్ సమావేశంలో
పాల్గొన్నఏఐటియుసి, సిఐటియు రాష్ట్ర ప్రధానకార్యదర్శలు వారి అనుబంద కార్మిక
సంఘాలు నాయకులు, వక్తలు హితవుపలికారు.
త్వరలో మా ఉద్యమకార్యచరణను ప్రకటిస్తాం : ఏపిజేఏసి చైర్మన్ బండి శ్రీనివాసరావు
ఏపిజెఏసి అమరావతి చేపట్టి ఉద్యమకార్యచరణకు పూర్తిమద్దతుని ప్రకిటిస్తున్నామని,
అలాగే ఈప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో వ్యవహరిస్తున్న మొండివైఖరితో
అన్నివర్గాల ఉద్యోగులు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందులకు గురి అవ్వడమే కాకుండా
ఆర్దికేతర సమస్యలు కూడా పరిష్కారం కాకుండా ఉన్నందున తీవ్రమైన ఇబ్బందులకు
గురిఅవుతున్నారు, విటిన్నింటి పరిష్కరించుకునేందుకు ఉమ్మడి ఉద్యమం అవసరమని
భావిస్తున్నామని, ఏపీ జేఏసీ అమరావతి చేపట్టిన ఉద్యమ కార్యాచరణకు సంపూర్ణ
మద్దతు తెలుపుతూ ఇందుకు సంబందించి త్వరలో ఏపీ ఎన్జీవో, ఏపిజెఏసి సమావేశాల్లో
చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తామని ఏపిజేఏసి చైర్మన్ బండి
శ్రీనివాసరావు, సెక్రటరీ జెనరల్ జి.హృదయరాజు తెలిపారు. ఈ రౌండ్ టేబుల్
సమావేశంలో ఏఐటియుసి అధ్యక్షులు రావుళపళ్లి రవీంధ్రనాధ్, ఉపప్రధానకార్యదర్శి
వెంకటసుబ్బయ్య, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏ.వి.నాగేశ్వరరావు తోపాటు ఆర్టీసి
ఇ.యు రాష్ట్ర ఉప ప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్య, కార్మికపరిషత్
ప్రధానకార్యదర్శి వై.యస్.రావు, మహిళాసంఘాల నాయకులురాళ్లు సైలజా, ధనలక్ష్మి,
వీరరాగవమ్మతో పాటు విద్యుత్ సంఘం/బి యస్ యన్ యల్ ఉద్యోగులు మద్దతు తెలిపారు.
ఉద్యమ కార్యచరణ కొనసాగిస్తాం : ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగులకు చెల్లించామని
చెపుతున్న డబ్భులు అన్ని ఉద్యోగులకు సంబందించీ వాడుకున్నవేనని, చట్టప్రకారం
ఉద్యోగులకు చెల్లించాల్సి బకాయిలు పైన, కాంట్రాక్టు& ఔట్ సోర్శింగు ఉద్యోగులు
సమస్యలుపైన,సిపియస్ ఉద్యోగుల సమస్యలుపైన, పబ్లిక్ సెక్టార్, గురుకులాలు మరియు
యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ ఉద్యోగులకు తదితర అంశాలపై ఉద్యోగులకు నమ్మకం
కలిగేలా స్పష్టత కలిగేంతవరకు ఉద్యమం కొనసాగిస్తామని చైర్మన్ బొప్పరాజు,
సెక్రటరీ జెనరల్ దామోదరరావు తెలిపారు.