హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసైకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ
అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఐటీ
విభాగం పాత్రకు సంబంధించి సిట్ దర్యాఫ్తు మీద నివేదిక కోరాలని ఆమె తన లేఖలో
కోరారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కి సంబంధించి షర్మిల కొద్ది రోజులుగా ఫైట్
చేస్తున్నారు. ఇటీవల సిట్ కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని,
అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పోలీసులపై ఆమె చేయి చేసుకోవడం
సంచలనంగా మారింది. అయితే తాను మహిళను అని కూడా చూడకుండా పోలీసుల ప్రవర్తన
ఉందని, అందుకే వారిని తోసేశాను తప్ప, కొట్టలేదని షర్మిల వివరణ ఇచ్చారు. ఇదిలా
ఉండగా టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. మరో
ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు 19 మందిని అరెస్ట్ చేశారు. మహబూబ్
నగర్‌కు చెందిన తండ్రీకొడుకులు మైసయ్య, జనార్దన్లను సిట్ అధికారులు అదుపులోకి
తీసుకున్నారు. కొడుకు కోసం రెండు లక్షల రూపాయలు పెట్టి ఏఈ పేపర్‌ను తండ్రి
కొనుగోలు చేశారు. దీంతో తండ్రీకొడుకులు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండుకు
తరలించారు.