న్యూఢిల్లీ : కీలక సమావేశం కోసం భారత్ వచ్చిన చైనా రక్షణ మంత్రి లీ షాంగ్ఫూ
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. తూర్పు లద్ధాఖ్‌లో
కొనసాగుతున్న సరిహద్దు వివాదంపై ఇరుదేశాల నేతలు ఈ సమావేశంలో చర్చించుకున్నట్లు
తెలుస్తోంది.
ఢిల్లీలో శుక్రవారం జరగనున్న షాంఘై సహకార సంస్థ-ఎస్సీఓ కీలక సమావేశం కోసం
భారత్ వచ్చిన చైనా రక్షణ మంత్రి లీ షాంగ్ఫూ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్
సింగ్‌తో భేటీ అయ్యారు. తూర్పు లద్ధాఖ్‌లో కొనసాగుతున్న సరిహద్దు వివాదంపై
ఇరుదేశాల నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌తో పాటు మధ్య
ఆసియాలోని ఇతర దేశాలలో లాజిస్టిక్ సమస్యలను తగ్గించడానికి అంతర్జాతీయ
ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ అభివృద్ధిపై చర్చించినట్లు సమాచారం.
మూడేళ్ల క్రితం తూర్పు లద్ధాఖ్ సరిహద్దు ప్రతిష్టంభన మొదలైన తర్వాత చైనా రక్షణ
మంత్రి భారత్‌కు రావడం ఇదే తొలిసారి. శుక్రవారం జరగనున్న షాంఘై సహకార సంస్థ
సమావేశానికి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. అఫ్గానిస్థాన్‌లో
పరిణామాలతో సహా ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం
ఉంది. పాకిస్థాన్ మినహా రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్,
ఉజ్బెకిస్థాన్ సహా ఎస్సీఓ లోని ఇతర సభ్య దేశాల రక్షణ మంత్రులు సమావేశంలో
పాల్గొనేందుకు భారత్‌కు రానున్నారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ
సమావేశానికి వర్చువల్ మోడ్ ద్వారా హాజరవుతారని తెలుస్తోంది. తూర్పు
లద్ధాఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఎసి) వెంబడి మూడు సంవత్సరాల సరిహద్దు
వివాదం ఇరుపక్షాల మధ్య సంబంధాలను గణనీయంగా దెబ్బతీసిందని లీతో జరిగిన
ద్వైపాక్షిక సమావేశంలో రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక
ఒప్పందాల ప్రకారం ఎల్ఏసీలో అన్ని సమస్యలను పరిష్కరించాలని చైనా రక్షణ
మంత్రిని రాజ్‌నాథ్ కోరారు. భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న పరిణామాలు
సహా ఇతర ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరు మంత్రులు కూలంకషంగా చర్చలు జరిపినట్లు
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే జరిపిన పలు
ఒప్పందాల ఉల్లంఘన రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీశాయని
రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు.
“ఎల్ఏసీ వద్ద నెలకొన్న సమస్యలను ప్రస్తుత ద్వైపాక్షిక ఒప్పందాలు, కట్టుబాట్లకు
అనుగుణంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
పేర్కొన్నారు.
చైనాకు సంస్కారమైన నమస్కారం!
ఏప్రిల్ 28న దేశంలో జరిగే షాంఘై సహకార సంస్థ-ఎస్సీఓ సందర్భంగా పలు దేశాల రక్షణ
మంత్రులు ఇప్పటికే భారత్‌కు చేరుకున్నారు. భారత్-చైనా ద్వైపాక్షిక సమావేశానికి
ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తజికిస్థాన్, ఇరాన్, కజకిస్థాన్ సహా ఇతర
దేశాల రక్షణ మంత్రులతో కరచాలనం చేశారు. కానీ, అక్కడే ఉన్న చైనా రక్షణ మంత్రి
జనరల్ లీ షాంగ్‌ఫూనకు మాత్రం చేతులు జోడించి నమస్కారం పెట్టారు రాజ్‌నాథ్.
చైనాతో చర్చలు ప్రారంభం కాకముందు తజికిస్థాన్ రక్షణ మంత్రి కల్నల్ జనరల్
షెరాలీ మీర్జో, ఇరాన్ రక్షణ మంత్రి, బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ రెజా ఘరాయీ
అష్టియాని సహా కజకిస్థాన్ రక్షణ మంత్రి కల్నల్ జనరల్ రుస్లాన్ జాక్సిలికోవ్తో
కూడా రాజ్‌నాథ్ సమావేశం అయ్యారు.