గుంటూరు : ఏపీ ప్రభుత్వానికి అరుదైన అవార్డు లభించింది. ప్రతిష్టాత్మక గోల్డ్
అవార్డును స్కోచ్ సంస్థ ప్రదానం చేసింది. పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల
నుంచి పెద్ద మొత్తంలో రుణాలు అందించడంతో పాటు ఆ రుణాలను సద్వినియోగం చేసుకుని,
సకాలంలో తిరిగి చెల్లించడంలో అత్యుత్తమ ఫలితాలను సాధించడంలో ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం వివిధ రూపాల్లో అందజేస్తున్న సహాయ సహకారాలకు గాను ప్రతిష్టాత్మక
స్కోచ్ సంస్ధ రాష్ట్ర ప్రభుత్వానికి గోల్డ్ అవార్డు అందచేసింది. గ్రామీణ
పేదరిక నిర్మూలన సంస్ధకు అనుబంధంగా పనిచేస్తున్న స్త్రీ నిధి సంస్ధ వివిధ
ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి పొదుపు సంఘాల మహిళలకు సులభ విధానంలో రుణాలు
అందజేస్తున్నందుకు స్కోచ్ అవార్డును స్త్రీ నిధి సంస్థ దక్కించుకుంది.
ముఖ్యమంత్రి వైయస్ జగన్కు అవార్డులు అధికారులు చూపించగా సీఎం వారిని
ప్రశంసించారు.