విజయవాడ : శ్రీ దేవీ కరుమారి అమ్మన్ శక్తి పీఠం వద్ద జరుగుతున్న సహస్త్ర చండీ
యాగాలు గురువారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమైయ్యాయి. శక్తి పీఠాధిపతులు
శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలు తొలిత 108 మంది
ముతైదువలతో పుణ్యనదీ జలాలతో శోభయాత్రను నిర్వహించగా నగర మేయర్ రాయన
భాగ్యలక్ష్మి ఈ యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ఈ యాత్రలో మాజీ మంత్రి
వెలంపల్లి శ్రీనివాసరావు, మాస్ట్రో గజల్ శ్రీనివాస్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు
,ఆంధ్రప్రదేశ్ పైబర్ నెట్ చైర్మన్ పునూరు గౌతమ్ రెడ్డి, సునీత, సుందరి
తదితరులు పాల్గొన్నారు. ఈ యాత్ర వై వి రావు ఎస్టేట్స్ నుండి మంగళ
వాయిద్యాలు,కోలాటాలు కోలాహలంతో యాగశాల వద్దకు చేరుకొంది. శ్రీ కనకదుర్గమ్మ
దేవస్థానం స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రధాన
యాగశాల వద్ద సంకల్ప క్రతువుని నిర్వహించారు. విఘ్నేశ్వర పూజా పుణ్యాహ
వచనము,పంచగవ్య ప్రసన,అంకురారోపణ మండపారాధన,మండపపూజా, నీరాజనం, మంతపుష్పం
జరిగాయి. ఈ కార్యక్రమంలో విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఋత్విక బృందం 80 మంది వేద
మంత్రోచ్చరణ గావించారు.
తొలిరోజు 72 అడుగులు ఎత్తు మహా చండీ కి పూజలు నిర్వహించిన మంత్రి కారుమూరి
దేశంలో మొట్టమొదటి సారిగా 72 అడుగులు ఎత్తులో మహాచండీ మట్టి విగ్రహాన్ని
ఏర్పాటు చేసి చేపట్టిన సహస్త్ర చండీ యాగం ప్రాంగణంలో ని మహా చండీ నిలువెత్తు
రూపాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సందర్శించారు.
ఆయన చండీ పాదాలు వద్ద కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు మాజీ
మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పీఠాధిపతులు
శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు,మాస్ట్రో గజల్ శ్రీనివాస్ గౌతమ్ రెడ్డి, రాంపిళ్ల
జయప్రకాష్,తదితరులు పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల
నుండి వేలాదిమంది తరలివచ్చారు. వేలాదిమంది భక్తులకు యాగశాల ప్రాంగణంలో
అన్నదానం జరిగింది.
సాయంత్రం యాగ ప్రాంగణంలో ముత్యాలంపాడు షిర్డీసాయి మందిరం భక్త బృందం
నిర్వహించినశ్రీ విష్ణు సహస్త్ర నామ పారాయణ,శ్రీ లలితా సహస్త్ర పారాయణం
భక్తులను మంత్ర ముగ్దుల్ని చేసింది.