చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్
రద్దయింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గంగిరెడ్డి
బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన
ఉన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. మే 5లోపు సీబీఐకి లొంగిపోవాలని
ఎర్ర గంగిరెడ్డిని కోర్టు ఆదేశించింది. లొంగని పక్షంలో ఆయన్ను అదుపులోకి
తీసుకోవాలని సీబీఐకి సూచించింది.
విచారణలో వాదనలు ఇలా : వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి
బయట ఉండటం వల్ల దర్యాప్తులో సహకరించడానికి ప్రజలు ఎవరూ ముందుకు రావడం లేదని
సీబీఐ బుధవారం హైకోర్టుకు నివేదించింది. ఆయన వెనుక రాజకీయ ప్రముఖులు ఉండటంతో
ప్రజల్లో భయం ఉందని తెలిపింది. నిర్దిష్ట గడువులోగా అభియోగపత్రం దాఖలు
చేయకపోవడంతో ఎర్ర గంగిరెడ్డికి మంజూరైన చట్టపరమైన బెయిలును రద్దు చేయాలంటూ
సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం జస్టిస్ చిల్లకూరు సుమలత విచారణ
చేపట్టారు. సీబీఐ తరఫు న్యాయవాది ఎం.నాగేందర్ వాదనలు వినిపిస్తూ బెయిలును
సమర్థిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసిందన్నారు.
దాని ఆధారంగా వాదనలు చెప్పడం సరికాదన్నారు. ఏ కారణాల మీద ఎర్రగంగిరెడ్డి
బెయిలు రద్దు కోరుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. వివేకా హత్య పెద్ద
కుట్ర అని, పథక రచన, అమలు అంతా ఎర్ర గంగిరెడ్డే చేశారని సీబీఐ తరఫు న్యాయవాది
చెప్పారు. ఆయన బయట ఉంటే ఇతరులు ఎవరూ దర్యాప్తునకు సహకరించరన్నారు.
సాధారణ బెయిలు, మెరిట్ ఆధారంగా బెయిలు మంజూరు చేయడం కాకుండా, చట్టపరమైన
బెయిలును పొందినప్పుడు కేసు పూర్వాపరాలు, తీవ్రత, నిందితుడి పాత్రను
పరిగణనలోకి తీసుకుని దాన్ని రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు కొత్తగా
తీర్పిచ్చిందని సీబీఐ న్యాయవాది చెప్పారు. అందువల్ల గతంలో చెప్పిన తీర్పుల
ఆధారంగా ఇందులో వాదనలు సరికాదన్నారు. ఎర్ర గంగిరెడ్డి బెయిలు పిటిషన్
సందర్భంగా సిట్ కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారని, అసలు సిట్ సరిగా
పనిచేయడం లేదని ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. అది సరిగా
పనిచేయకపోవడం వల్లనే సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు. సిట్ కౌంటర్‌ను
పరిగణనలోకి తీసుకోవడం సరికాదన్నారు. స్థానిక పోలీసులు ఏడాదిపాటు దర్యాప్తును
ముందుకు తీసుకెళ్లలేదన్నారు. గూగుల్ టేకౌట్ వంటి సాంకేతిక ఆధారాలున్నాయని,
గంగిరెడ్డి బెయిలును రద్దు చేయాలని కోరారు.