24 ఏళ్ల తరువాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబీకుడిని అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నుకుంది. ఆంగ్ల భాషపై పట్టున్న తన ప్రత్యర్థి శశిథరూర్ను చారిత్రాత్మక ఎన్నికల్లో ఓడించి మాపన్న మల్లికార్జున్ ఖర్గే విజేతగా నిలిచారు. 1994 నుంచి 96 వరకు పీవీ నరసింహారావు, 96 నుంచి 98 వరకు సీతారాం కేసరి గాంధీయేతర కుటుంబం నుంచి చివరిసారిగా కాంగ్రెస్ అధ్యక్షులుగా వ్యవహరించారు..కాగా,
2019వరకు 12 ఎన్నికల్లో (అసెంబ్లీ, లోక్సభ రెండింటిలోనూ) పోటీ చేసి, ఒక్కసారి మాత్రమే ఓటమిని చవిచూసిన అనుభవజ్ఞుడైన నాయకుడు ఖర్గే.. అన్నిసార్లు ఎన్నికవడం ద్వారా ఆయన చరిత్ర సృష్టించాడు. 2004లో కర్ణాటక అసెంబ్లీకి వరుసగా ఎనిమిదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చితాపూర్ నుంచి అసెంబ్లీకి వరుసగా తొమ్మిదోసారి ఎన్నికై మరో మైలురాయిని నెలకొల్పాడు.
80 ఏళ్ల అనుభవజ్ఞుడైన కాంగ్రెస్ నాయకుడు ఖర్గే. జగ్జీవన్ రామ్ తర్వాత రెండవ దళితుడు కాంగ్రెస్ చీఫ్గా ఎన్నిక కావడం విశేషం.
1942 జులై 21న బీదర్లో జన్మించిన ఖర్గే 1969లో కాంగ్రెస్లో చేరి అనేక శాఖలను నిర్వహించారు. అతను ఫిబ్రవరి 16, 2021 నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఫిబ్రవరి 16, 2021 నుంచి అక్టోబర్ 1, 2022 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.
మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రైల్వే, కార్మిక, ఉపాధి శాఖల మంత్రిగా ఖర్గే పనిచేశారు. 2014-2019 మధ్యకాలంలో ఆయన లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నారు.
మూలం: ఇండియా టుడే