హైదరాబాద్ : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి
నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారికి ఆర్థిక భారం
తగ్గించే విధంగా నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్ ధరను
రూ.100 నుంచి రూ.90కి తగ్గించింది. ఇదే టికెట్‌ను సీనియర్ సిటిజన్లకు రూ.80కే
అందించనున్నట్టు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.
సీనియర్ సిటిజన్లు వయసు ధ్రువీకరణ కోసం తమ ఆధార్ కార్డును బస్ కండక్టర్లకు
విధిగా చూపించాల్సి ఉంటుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టి-24 టికెట్
కొత్త ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లో ఎక్కువగా
ప్రయాణించే వారికోసం టి-24 టికెట్‌ను ఆర్టీసీ గత నెలలో అందుబాటులోకి
తెచ్చింది. ఈ టికెట్ కొనుగోలు చేస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ
ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా
ప్రయాణించవచ్చు. టి-24 టికెట్‌కు మంచి స్పందన వస్తోందని, ప్రతి రోజు సగటున
25వేల వరకు టికెట్లు అమ్ముడవుతున్నాయని సజ్జనార్ వెల్లడించారు. సిటీ పరిధిలో
తిరిగే ఆర్డినరీ, మెట్రో బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్ అందుబాటులో
ఉంటుందన్నారు.

మహిళలు.. సీనియర్ సిటిజన్ల కోసం టి-6 : మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టి-6
టికెట్‌ను ఇటీవల ప్రారంభించినట్టు చెప్పారు. రూ.50కి టికెట్ కొనుగోలు చేస్తే
ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రయాణించవచ్చని తెలిపారు. కుటుంబ
సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్‌ను అందుబాటులోకి తెచ్చామని
వివరించారు. రూ.300 చెల్లించి టికెట్ కొనుగోలు చేస్తే 24 గంటల పాటు నలుగురు
ప్రయాణించవచ్చన్నారు. హైదరాబాద్ సిటీ పరిధిలో తీసుకువచ్చిన టి-24, టి-6,
ఎఫ్-24 టికెట్లు కొనుగోలు చేసి క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు
చేరుకోవాలని సూచించారు.