ఇటీవలి కాలంలో చర్మ కేన్సర్లతో బాధపడుతున్నవారి సంఖ్య బాగా పెరిగిపోతోంది.
ముఖ్యంగా వాతావరణ కాలుష్యం, అతినీలలోహిత కిరణాల ప్రభావానికి గురికావడం, సరైన
పరిశుభ్రత పాటించకపోవడం, రేడియేషన్ వంటి కారణాల వల్ల చర్మ కేన్సర్లు
పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు తమ జీవిత కాలంలో
సాధారణ చర్మ కేన్సర్ వ్యాధి బారిన పడుతున్నట్టు అంచనా.
ముఖ్యంగా తెల్లని చర్మం ఉన్న వారు సూర్యరశ్మి ప్రభావానికి ఎక్కువగా
లోనవుతారని.. తద్వారా కేన్సర్ ప్రమాదం పెరుగుతుందని అమెరికన్ అకాడమీ ఆఫ్
డెర్మటాలజీ (ఏఏడీ) వెల్లడించింది. అమెరికాలో అయితే ప్రతి ఐదుగురిలో ఒకరు
సాధారణ చర్మ కేన్సర్ బారిన పడుతున్నారని తెలిపింది. చర్మ కేన్సర్లను ప్రారంభ
దశలోనే గుర్తించినట్లైతే దాదాపు 98 శాతం వరకు శస్త్రచికిత్స అవసరం లేకుండానే
నయం చేయొచ్చని స్పష్టం చేసింది.
కుటుంబంలో ఎవరికైన కేన్సర్ ఉంటే తరువాతి తరాలకు వచ్చే అవకాశం ఎక్కువగా
ఉంటుందని, ఇది మెలానోమా కేన్సర్ విషయంలో ఎక్కువగా జరుగుతుందని శాస్త్రవేత్తలు
పేర్కొన్నారు. అలాంటి కేన్సర్లను నియంత్రించలేమని, అది జన్యువుల్లోనే ఉంటుందని
స్పష్టం చేస్తున్నారు. ఎండ నుంచి వచ్చే అతినిలలోహిత కిరణాల వల్ల ఎక్కువగా
కేన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
చర్మం తెల్లని రంగులో ఉండడం (మెలనిన్ తక్కువగా ఉండడం), ఎత్తైన
ప్రదేశాల్లో ఉండే వాతావరణం వల్ల అక్కడ నివసించే వారికి స్కిన్ కేన్సర్ వచ్చే
అవకాశాలు ఎక్కువ. ఇక అసాధారణ మచ్చలు, రేడియేషన్, రోగ నిరోధక శక్తి తక్కకువగా
ఉండటం, హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ తో బాధపడుతుండటం, అవయవ మార్పిడి జరిగిన
వ్యక్తుల్లో కేన్సర్ కు అవకాశాలు ఎక్కువ. అలాగే డ్రగ్స్ తీసుకునేవారిలో కూడా
కేన్సర్ రావొచ్చు.