ఆరోగ్యవంతులు సైతం ప్రతీ ఆరు నెలలకోసారి పూర్తి స్థాయి రక్త పరీక్షలు
చేయించుకోవాలన్నది వైద్యుల సూచన. ఎందుకులే? అన్న అభిప్రాయం కొందరిలో ఉంటుంది.
ముందుగా గుర్తిస్తే వ్యాధిని నయం చేసేందుకు సమర్థవంతమైన చికిత్స ఇవ్వడంతోపాటు,
ప్రాణాలను కాపాడడం సులభం అవుతుంది.
అత్యధిక శాతం ప్రజలు లివర్ పనితీరుపై శ్రద్ధ పెట్టక పోవడంతో సమస్య
ప్రాణంతకంగా మారినప్పుడు ఆస్పత్రుల చుట్టూ తి రగా ల్సి వస్తుంది. ఈ నేపధ్యంలో
రెగ్గులర్ గా లివర్ పనితీరుపై వైద్య పరీక్షలు చేయించు కోవడం ద్వార
భవిష్యత్తులో సమస్యలు లేకుండా నివారించవచ్చు .
శరీరంలో ఉండే కాలేయం (లివర్) అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇది ఎన్నో
రకాల పనులను నిర్వహిస్తుంటుంది. దీని పనితీరును లివర్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా
తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష కూడా కాలేయం గురించి చాలా రకాల సమాచారాన్ని
అందిస్తుంది. ఈ పరీక్షల్లో భాగంగా శరీరంలో పోషకాలు ఎంతున్నది ప్రొటీన్
గణాంకాలు తెలియజేస్తాయి. అల్బూమిన్ అన్నది రక్తంలో ఒకానొక ప్రధాన ప్రొటీన్.
ఎంత పోషకాలు అందుతున్నది దీని ద్వారా తెలుస్తుంది. అలాగే గ్లోబులిన్. రక్తంలో
ఇదొక ప్రొటీన్ల సమూహం. ఇన్ఫెక్షన్లపై పొరాడే యాంటీబాడీలతో కలసి ఉంటుంది.
కొవ్వు కరిగించడం, కాలేయ పనితీరును బైల్ రూబిన్ తెలియజేస్తుంది. బైల్ రూబిన్
అధికంగా ఉంటే కామెర్లు ఉన్నట్టు.

ఇంకా లివర్ లోనే మూడు ముఖ్యమైన ఎంజైమ్స్ ఉంటాయి. వాటిలో ఆల్కాలిన్
ఫాస్పాటేస్ అనేది బాడీ ప్రొటీన్. ఇది ఎముక, లివర్ పనితీరును తెలియజేస్తుంది.
పిత్తాశయంలో ఏవైనా అడ్డంకులు ఉంటే ఆల్కాలిన్ ఫాస్పాటేస్ పెరుగుతుంది. తల,
గుండె కండరాల్లో ఆస్పార్టేట్ అమినో ట్రాన్స్ ఫరేజ్ (ఏఎస్ టీ లేదా ఎస్జీవోటీ)
ను గుర్తించొచ్చు. ఇందులో ఏవైనా అసాధారణత ఉంటే అది కాలేయ వ్యాధికి సూచిక. మూడో
ఎంజైమ్ అలానైన్ అమినో ట్రాన్ఫరేజ్ (ఏఎల్ టీ లేదా ఎస్ జీపీటీ) అనేది ప్రధానంగా
లివర్ లో ఉండే ఎంజైమ్. ఇందులో అసాధారణత ఉంటే లివర్ వ్యాధికి సూచన.