నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఎన్.బి.కె.107’. ఈ సినిమా టైటిల్ ఇదంటూ.. అనేకానేక పేర్లు సోషల్ మీడియా వైరల్ అవుతున్న నేపధ్యంలో.. ఇక ఆలస్యం చేయకూడదని భావించిన టీమ్.. దీపావళి స్పెషల్‌గా సినిమా టైటిల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ విషయం అధికారికంగా ప్రకటించారు కూడా. మేకర్స్ నుంచి ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో.. అప్పటి నుంచి నందమూరి అభిమానులు ఎంతగానో ఈ సినిమా టైటిల్ కోసం వేచిచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మాస్ లుక్, ఫస్ట్ హంట్ వీడియో.. బీభత్సమైన అంచనాలను క్రియేట్ చేయగా.. ఇక టైటిల్ కూడా వస్తే.. ట్రెండ్ సెట్టర్ చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారు.
మరి ఇలాంటి టైమ్‌లో ఈ సినిమా టైటిల్ లీకయిందంటూ సినీ సర్కిల్స్‌లో వినబడుతోంది. ఇక ఈ లీకయిదంటూ చెప్పుకుంటున్న టైటిల్ వింటే.. నందమూరి అభిమానులకు పండగే. ఇంతకీ ఆ లీకైన టైటిల్ ఏమిటనుకుంటున్నారు.. ‘వీరసింహా రెడ్డి’. నిజంగా ఇదే టైటిలా? లేదంటే ఇంతకుముందు పుట్టుకు వచ్చినటువంటిదేనా? అనేది తెలియాలంటే మాత్రం ఈ నెల 21 వరకు వెయిట్ చేయకతప్పదు. టైటిల్‌ను ఈ నెల 21న ఐకానిక్ ప్లేస్ కర్నూల్లోని కొండా రెడ్డి బురుజు వద్ద విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా మేకర్స్ ప్రకటించారు.