విజయవాడ :లోక కళ్యాణార్థం శ్రీదేవి కరుమారి అమ్మన్ శక్తిపీఠం ఆధ్వర్యంలో ఈనెల
27వ తేదీ నుండి మే మూడో తేదీ వరకు సహస్ర చండీయాగం,కుంభా భిషేకం కార్యక్రమాలు
వైభవోపేతంగా ప్రారంభం అవుతున్నాయని ఉత్సవ కమిటీ చైర్మన్ పి. గౌతమ్ రెడ్డి
చెప్పారు. బుధవారం సహస్ర చండీయాగం జరిగే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల
సమావేశంలో కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడారు. ఉత్సవ
కమిటీ చైర్మన్ పి.గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం జరుగుతున్న
సహస్ర చండీయాగం లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని చెప్పారు. 72 అడుగుల
ఎత్తైన అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. సహస్ర
చండీయాగం ప్రారంభ కార్యక్రమంలో తొలి రోజున రాష్ట్ర మంత్రులు కారుమూరి
నాగేశ్వరరావు,జోగి రమేష్, మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ మేయర్
రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొంటారని చెప్పారు. అలాగే ఇంకా ఎంతో మంది
ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు.
సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ నిర్వాహకులు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీదేవి
కరుమారి అమ్మన్ శక్తి శక్తి పీఠం ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి మేమూడో తేదీ వరకు
నిర్వహించనున్న సహస్ర చండీయాగం, కుంభాభిషేకం కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద
ఎత్తున పాల్గొవాలని విజ్ఞప్తి చేశారు. గంగా పుష్కరాల సమయంలో ఈ కార్యక్రమం
జరగడం ఎంతో శుభకరమని అన్నారు. ఈ చండీయాగంలో పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు,
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. ఎన్నో
భక్తి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
శ్రీదేవి కరుమారి అమ్మన్ శక్తిపీఠం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కరుమారి దాసు
మాట్లాడుతూ కోరిన కోరికలను తీర్చే కల్పవల్లి, ఆదిపరాశక్తి కృపాకటాక్షాలు
ప్రజలపై ఉండాలని సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో
పాల్గొని ధన్యులు కావాలని భక్తులను కోరారు. కమిటీ సభ్యురాలు,నగర వైసీపీ మాజీ
మహిళా కన్వీనర్ లఖంరాజు సునీత మాట్లాడుతూ ఈ సహస్ర చండీయాగం సందర్భంగా అనేక
కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మహా కార్యక్రమంలో మహిళా భక్తులు
వేలాదిగా పాల్గొంటున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో శ్రీశ్రీశ్రీ కల్యాణ స్వామి ఈ
సహస్త్ర చండీ యాగం విశిష్టతను వివరించారు.