43వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా – వెలంపల్లి
వందల కోట్ల రుపాయల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా – వెలంపల్లి
విజయవాడ : స్థానిక 43వ డివిజన్ ఏకలవ్య నగర్ 140వ సచివాలయం పరిధిలో బుధవారం
జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి,
పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్యఅతిధిగా
పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి మధ్య
తేడాను వివరిస్తూ ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ చిత్రం ఉన్న
స్టిక్కర్లను అంటించారు అనంతరం 43వ డివిజన్ లో వివిధ ప్రాంతాలలో జరుగుతున్న
అభివృద్ధి పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేసారు ఈ సందర్భంగా
వెలంపల్లి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న
జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగిందన్నారు. ప్రజలు నుంచి
చక్కటి స్పందన లభిస్తుందన్నారు. ఈ డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధిని
పరిశీలిస్తూ త్వరిగితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశాలు
ఇచ్చారు. సుమారు 24 కోట్ల రూపాయలతో డివిజన్ను అభివృద్ధి పరుస్తున్నామన్నారు.
నేటికీ 12 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పరిచామని మిగిలిన అభివృద్ధి పనులు
త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఐరన్ యార్డ్ లో వర్కర్స్ కి భోజనశాలను
మరియు మరుగుదొడ్లను కూడా నిర్మించడం జరిగిందన్నారు. గత టిడిపి హయాంలో ఈ
డివిజన్ లో వైకాపా కార్పొరేటర్ ఉన్నారని డివిజన్ అభివృద్ధిని
గాలికొదిలేశారన్నారు. నేడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని డివిజన్లను
అభివృద్ధి పరుస్తున్నామన్నారు. వందల కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గ
అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. నియోజకవర్గం లో రోడ్లన్నీ తన హయాంలోనే
వేసినట్లు తెలిపారు. విజయవాడ నగరాన్ని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దెందుకు
కృషి చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి, బట్టిపాటి శివ, కట్ట
సత్తయ్య, కంది శ్రీనివాసరెడ్డి, మాదాల తిరుపతిరావు, పువ్వుల కాంతారావు, మద్దెల
రామకృష్ణా, కనకం వెంటేశ్వర్లు యాదవ్, మాగం ఆత్మారామ్, ఎస్వీ రెడ్డి, తిరుపతి
రెడ్డి, వి శ్రీనివాసరెడ్డి, ముద్దు లక్ష్మి, కె రమాదేవి, సచివాలయం
కన్వీనర్లు, గృహసారధులు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.