కార్యాలయాల తరలింపు బుధవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని శాఖలకు ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలోని మొదటి
అంతస్తు నుంచి ఐదో అంతస్తు వరకు మంత్రులవారీగా ఛాంబర్లను కేటాయించారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సుమారు రూ.3వేల కోట్లతో నిర్మించిన
డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయ భవనం ఈనెల 30వ తేదీన
ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అందులోకి కార్యాలయాల తరలింపు ప్రక్రియ
బుధవారం నుంచే ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని శాఖలకు ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలోని మొదటి అంతస్తు
నుంచి ఐదో అంతస్తు వరకు మంత్రులవారీగా ఛాంబర్లను ఇప్పటికే కేటాయించారు. వారికి
అనుబంధంగా ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులు, విభాగాలకు ఛాంబర్లు, గదులు,
వర్క్ స్టేషన్లను కేటాయించారు. శాఖలవారీ కొత్త సచివాలయంలోకి రేపటి నుంచి
తరలింపు ప్రక్రియ చేపట్టాలన్న ప్రభుత్వ సీఎస్.. ఒక్కో శాఖకు ఒక్కో సమయాన్ని
కేటాయించారు. ఈనెల 28వ తేదీ నాటికి తరలింపు ప్రక్రియ పూర్తిచేయాలని సీఎస్
శాంతకుమారి అన్ని శాఖల కార్యదర్శలను ఆదేశించారు.
సచివాలయంలోని మొదటి అంతస్తు నుంచి ఐదో అంతస్తు వరకు మంత్రులవారీగా ఛాంబర్లను
ఇప్పటికే కేటాయించారు. వారికి అనుబంధంగా ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులు,
విభాగాలకు ఛాంబర్లు, గదులు, వర్క్ స్టేషన్లను కేటాయించారు. శాఖలవారీ కొత్త
సచివాలయంలోకి బుధవారం నుంచి తరలింపు ప్రక్రియ చేపట్టాలన్న ప్రభుత్వ సీఎస్
ఒక్కో శాఖకు ఒక్కో సమయాన్ని కేటాయించారు. ఈనెల 28వ తేదీ నాటికి తరలింపు
ప్రక్రియ పూర్తిచేయాలని సీఎస్ శాంతకుమారి అన్ని శాఖల కార్యదర్శలను ఆదేశించారు.
ఈనెల 30న సచివాలయం ప్రారంభించేనాటికి పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహించే
విధంగా సిద్దం కావాలని ఆమె స్పష్టంచేశారు. ఈనెల 30న వేకువ జామునే సచివాలయ
ప్రాంగణంలో రహదారులు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి సుదర్శన యాగం
నిర్వహిస్తారు. మధ్యాహ్నం పూర్ణాహుతి సమయానికి సీఎం కేసీఆర్ సచివాలయానికి
వస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాల నుంచి ఒంటి గంట 33 నిమిషాల మధ్య
సింహలగ్న ముహూర్తంలో కేసీఆర్ తన సీట్లో ఆసీనులవుతారు. తర్వాత మంత్రులు,
అధికారులు తమ సీట్లలో కూర్చుంటారు. మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 మధ్య
కార్యదర్శులు, అధికారులు వారి వారి సీట్లలో కూర్చొని ఏదో ఒక దస్త్రంపై సంతకం
చేయాల్సి ఉంటుంది. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ
ఉద్యోగులను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం అక్కడే
అందరికి భోజనం ఏర్పాట్లు చేస్తారు. సచివాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి
సీఎస్ అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆర్అండ్బీ, ఐటీ, పోలీసు, ఐ అండ్ పీఆర్, పురపాలక, వైద్య ఆరోగ్య, జల మండలి,
అగ్నిమాపక, విద్యుత్, విజయ డెయిరీ, ప్రొటోకాల్, సాధారణ పరిపాలన శాఖ, హైదరాబాద్
కలెక్టర్ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. విశాల
ప్రాగణంలో ఇంద్రభవనాన్ని తలపించే నూతన సచివాలయ పనులు తుది దశకు చేరుకున్నాయి.
సచివాలయం ముందు హామం నిర్వహించడానికి మండపం తయారు చేస్తున్నారు. వీటి పనులను
మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.