ప్రకటించింది బీసీసీఐ. కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో 15 మందితో కూడిన
జట్టును ఎంపిక చేశారు. ఐపీఎల్లో అదరగొడుతున్న అజింక్య రహానేకు ఊహించినట్లే
మళ్లీ పిలుపువచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానే అనుభవం ఉపయోగపడుతుందని
బీసీసీఐ భావించింది. గాయపడిన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రహానే టెస్టు టీమ్‌లోకి
ఎంట్రీ ఇచ్చాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్
కిషన్‌ను పక్కనబెట్టారు. వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్ ఎంపికయ్యాడు.
ఇంగ్లాండ్‌లో జూన్ 7వ తేదీ నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్
ప్రారంభంకానుంది.
ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్‌ను టెస్టు
టీమ్ నుంచి పక్కనపెట్టారు. అయితే ఆసీస్‌పై పేలవ ప్రదర్శన చేసినా.. కేఎల్
రాహుల్ మాత్రం తన స్థానం నిలబెట్టుకున్నాడు. మిడిల్ ఆర్డర్ కాస్త బలహీనంగా
ఉండడంతో కేఎల్ రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించి.. మిడిల్ ఆర్డర్ ఆడించే
అవకాశం కూడా ఉంది. ఆసీస్ వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లోనే
ఆకట్టుకున్నాడు. ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ కూడా టెస్టు టెస్టు జట్టులోకి
తిరిగివచ్చాడు.
బౌలింగ్ విభాగంలో ముగ్గురు స్పిన్నర్లకు చోటు కల్పించింది. రవీంద్ర జడేజా,
రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు. కుల్దీప్ యాదవ్‌ను
డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి తప్పించారు. ఇంగ్లాండ్ పరిస్థితులు పేస్‌కు అనుకూలంగా
ఉంటాయి. దీంతో షమీ, సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ పేస్ బాధ్యతలు
పంచుకోనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు 17 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను
ఆస్ట్రేలియా ప్రకటించిన విషయం తెలిసిందే.