గతంలో ఏప్పుడు ఉధ్యమం ఊసెత్తని బొప్పరాజుకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?
ఎపి రెవిన్యూ జాక్ రాష్ట్ర ఛైర్మన్ వి.ఎస్ దివాకర్
విజయవాడ : అమరావతి జేఏసీ పేరుతో బొప్పరాజు వెంకటేశ్వర్లు చేస్తున్న ప్రభుత్వ
వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ జేఏసీ తీవ్రంగా
ఖండిస్తుందని ఎపి రెవిన్యూ జాక్ రాష్ట్ర ఛైర్మన్ వి.ఎస్ దివాకర్ తెలిపారు. దేశ
వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అశ్వద్ధామ రెడ్డి నాయకత్వంలో
తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయమని సమ్మె చేస్తే, ఆర్టీసీని
ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారని,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడగకుండా ఆర్టీసీ
ప్రభుత్వంలో విలీనం చేసి, కోవిడ్ సమయంలో కూడా, బస్సులు తిరగక పోయినా,
ఆక్యుపెన్సి లేకపోయినా, జీతాలు సక్రమంగా చెల్లించి ఆర్టీసీని బలోపేతం
చేశారన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి సుమన్ 4000 మందిని
వీఆర్ఏలకు వీఆర్వోలుగా విధంగా సీనియర్ సహాయకులుగా అలాగే తరగతుల ఉద్యోగులకు
ఇటివల 66 మంది తాసిల్దార్లకు డిప్యూటీ కలెక్టర్ అదన్నతి కల్పించినందుకనా
ఉద్యమం అని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాలు, అన్ని శాఖల్లో పదోన్నతులు, అన్ని
శాఖల్లో ఖాళీలు భర్తీ, ఆశా, అంగన్వాడి హోంగార్డు తదితర ఉద్యోగులకు జీతం పెంపు
ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమంది ఉద్యోగాలకు నియామకాలు చేసి ఇంకా చేస్తున్న,
మిగతావి జరగకుండా ఆపడానికా ఉద్యమం అని ప్రశ్నించారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా
జరుగుతున్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నాలో మా సభ్యులు
పాల్గొనలేదని గతంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 6 లేక 7 నెలలకు ఒకసారి జీతం
వస్తుంటే వారికి ఉద్యోగ భద్రత లేకుండా ఉంటే ఉద్యమం వూసెత్తని బొప్పరాజు వారికి
కార్పొరేషన్ పెట్టి ఉద్యోగ భద్రత కల్పించి సక్రమంగా జీతాలు చెల్లిస్తూ ఉంటే
ఇప్పుడు ఉద్యమం ఏంటి?. నేడు జరిగిన ఔట్సోర్సింగ్ నిరసనలలో ఔట్సోర్సింగ్
ఉద్యోగులు ఎవరూ లేరు, వారి వద్ద ఉన్న సంఘాల మెంబర్స్ తప్పని సరి
పరిస్థితుల్లో మాత్రమే పాల్గొన్నారని, ఇది గమనించాలని కోరారు. గతంలో ఎప్పుడు
ఉద్యమ ఉసేత్తని బొప్పరాజు మహీళా తాసిల్దార్ పై దాడి చేస్తే ఖండించని బొప్పరాజు
ఈ ఉద్యమ నాటకం ఏమిటని, ఇతని అవినీతి చరిత్ర త్వరలోనే పూర్తిగా బయట పెడతామని
హెచ్చరించారు.