విజయవాడ : ఉద్యోగుల ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ టైపిస్టు కం కంప్యూటర్
ఆపరేటర్ల సంఘం దూరమని ప్రకటించింది. మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ టైపిస్ట్
కం కంప్యూటర్స్ ఆపరేటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జ్యోతుల సూర్య బాబు
ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి
అధికారం లోకి రాగానే ఇచ్చిన హామీని నిజం చేస్తూ ది.03.07.2020న మధ్యవర్తిత్వం,
దళారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తూ “ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్
సోర్సింగ్ సర్వీసెస్” అను ఒక ప్రభుత్వరంగ కార్పొరేషన్ ఏర్పాటుచేసి, అవుట్
సోర్సింగ్ ఉద్యోగులందరిని కార్పొరేషన్ పరిధిలోనికి తీసుకునివచ్చి ప్రతీ నెల
1.వ తేదీన జీతాలు చెల్లిస్తున్నందుకు ముఖ్యమంత్రి కి మేము రుణపడి ఉంటామని
స్పష్టం చేశారు. గతం లో ఈపీఎఫ్, ఈఎస్ఐ ఎంత కట్ అవుతున్నాయి, ఎంత జమ
అవుతున్నాయి అదేవిధముగా కుటుంబ అవసరాలు వస్తే ఎలా మనం దాచుకున్న సొమ్మును
తీసుకోవలో తెలియని పరిస్థితులనుండి నేడు ఈపీ ఎఫ్, ఈ ఎస్ ఐ సమస్యల పరిష్కారం
కొరకు అప్కోస్ నందు ఒక ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసి నిరంతరం అవుట్ సోర్సింగ్
ఉద్యోగులకు అన్ని రకములుగా మేలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి పూర్తి కృతజ్ఞతగా
ఉంటామని తెలిపారు. గతంలో 7 లేదా 9 నెలలవరకు జీతాలు రాలేనప్పుడు మాట్లాడని వారు
నేడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్నిరకములుగా మంచి చేస్తున్న ఈ ప్రభుత్వంపై
నేడు ధర్నాలకు పిలుపు ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ టైపిస్టు కం కంప్యూటర్
ఆపరేటర్ల సంఘం పూర్తిగా ఖండిస్తుందన్నారు. ఏ.పి.జె.ఏ.సి అమరావతి ఇచ్చిన
పిలుపునకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ టైపిస్టు కం కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం దూరంగా
ఉంటుందని తెలియజేస్తున్నామన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్నిరకములుగా
సానుకూలంగా ఉన్న ఈ ప్రభుత్వంనకు పూర్తి కృతజ్ఞతగా ఉంటామని తెలియజేస్తున్నామని,
కొంతమంది అధికారులతో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ టైపిస్టు కం కంప్యూటర్ ఆపరేటర్ల పై
ఒత్తిడి తేవాలని చూస్తే సహించేది లేదన్నారు. ఈ ప్రభుత్వం మరెన్నో ప్రయోజనాలను
తొందరలోనే నెరువేరుస్తుందని పూర్తి నమ్మకం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
వై.యస్.జగన్ మోహనరెడ్డి పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
రెవెన్యూ జేఏసీ చైర్మన్ వి.యస్ దివాకర్, ఎస్.ధైర్యం తదితరులు పాల్గొన్నారు.