కేసును సీబీఐకి ఇవ్వాలంటూ హతుడు సుబ్రమణ్యం తరుపు న్యాయవాది జడ శ్రావణ్
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.
సీబీఐ విచారణకు ఇచ్చే అంశంలో తన వాదనలు వినాలంటూ ఎమ్మెల్సీ అనంత్ బాబు
ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వెకేషన్ తరువాత వాదనలు వింటామని హైకోర్టు
తెలిపింది.
పోలవరం కుడి కాలువ అక్రమ తవ్వకాలపై హైకోర్టు సీరియస్ : పోలవరం కుడి కాలువ
అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ తవ్వకాలు
జరుగుతున్నాయని పిల్లి సురేంద్ర బాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గతంలో
హైకోర్టులో విచారణ జరుగగా తవ్వకాలు నిలిపివేయాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం
ఆదేశించింది. అయినప్పటికీ అక్రమ తవ్వకాలు ఆగకపోవడంపై హైకోర్టులో కోర్టు
దిక్కార పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం
విచారించింది. పిటీషనర్ తరపున న్యాయవాది పాలేటి ఉమా మహేశ్వరరావు వాదనలు
వినిపించారు. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి అక్రమ తవ్వకాలు చేస్తున్న
దృశ్యాలను న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. తవ్వకాలు నిలిపివేయాలని కోర్టు
ఆదేశించినప్పటీకి తవ్వకాలు జరపడంపై కోర్టు సీరియస్ అయ్యింది. జలవనరుల శాఖ
ప్రిన్సిపల్ సెక్రటరీ, ఛీఫ్ ఇంజనీర్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని
ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా
వేసింది.