పార్వతీపురం : రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో ప్రకటించిన ఉత్తమ గ్రామ
పంచాయతీల సర్పంచులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బహుమతులను పంపిణి
చేస్తారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పంచాయతి రాజ్ దినోత్సవం
సందర్భంగా అవార్డులను పంపిణీ చేశారు. 14 గ్రామ పంచాయితీలు ర్యాంకులు సాధించడం
పట్ల జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. అంకితభావంతో మంచి సేవలు
అందిస్తే వాటికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని ఆయన చెప్పారు. ఇదే పనితీరు
కనబరిచి మరిన్ని అవార్డులు పొందాలని ఆయన అన్నారు.
జిల్లాకు చెందిన 14 గ్రామ పంచాయతీలు వివిధ విభాగాల్లో ర్యాంకులు దక్కించు
కున్నాయని జిల్లా గ్రామ పంచాయితీ అధికారి బలివాడ సత్యనారాయణ వివరించారు.
మొత్తం తొమ్మిది విభాగాలు (థీమ్ లు)లో ర్యాంకులు ప్రకటించారని ఆయన చెప్పారు.
జిల్లా స్థాయిలో క్రింద తెలియజేసిన గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయి. పేదరికంలేని
మరియు మెరుగైన జీవనోపాధుల గ్రామం విభాగం (థీమ్ 1)లో పార్వతిపురం మండలం చిన
బొండపల్లి గ్రామపంచాయితీకి రెండవ ర్యాంక్ దక్కింది. ఆరోగ్యవంతమైన గ్రామ
పంచాయతీగా విభాగం (థీమ్ 2) లో గుమ్మలక్ష్మీపురం మండలం గుమ్మలక్ష్మీపురం గ్రామ
పంచాయతీకి మొదటి ర్యాంక్ లభించింది. నీటి సమృద్ధి గల గ్రామం విభాగం(థీమ్ 4)లో
పాలకొండ మండలం వెలగవాడ గ్రామ పంచాయతీ, సీతానగరం మండలం జోగింపేట గ్రామ
పంచాయతీకి మొదటి ర్యాంక్ లభించింది.
పరిశుభ్రమైన హరిత గ్రామం విభాగం (థీమ్ 5)లో సీతానగరం మండలం జోగింపేట గ్రామ
పంచాయతీకి మూడవ ర్యాంక్ లభించింది. స్వయం సమృద్ధి ఉన్న మౌళిక సదుపాయాలు కలిగిన
గ్రామం విభాగం (థీమ్ 6) లో కురుపాం మండలం పెద్ద సొత్తీలి గ్రామ పంచాయతీకి
మొదటి ర్యాంక్, గురుగుబిల్లి మండలం గురుగుబిల్లికి రెండవ ర్యాంక్ దక్కింది.
సామాజికంగా సురక్షితమైన గ్రామం విభాగం (థీమ్ 7) లో గరుగుబిల్లి మండలం
కొత్తపల్లి మొదటి ర్యాంక్ దక్కించుకుంది.
సుపరిపాలన కలిగిన గ్రామం విభాగం (థీమ్ 8)లో బలిజిపేట మండలం మిర్తి వలస గ్రామ
పంచాయతీకి మొదటి ర్యాంక్, సీతానగరం మండలం జోగింపేట గ్రామ పంచాయతీ రెండవ
ర్యాంక్, బలిజిపేట మండలం పెదపెంకి గ్రామ పంచాయతీకి మూడవ ర్యాంక్ లభించింది.
లింగ సమానత్వంతో మరింతగా గ్రామాభివృద్ధి విభాగం (థీమ్ 9) లో సీతానగరం మండలం
జే.ఎమ్. వలస గ్రామపంచాయతీ రెండవ ర్యాంక్, సీతానగరం మండలం దయానిది పురం
గ్రామపంచాయతీ, సీతంపేట మండలం సీతంపేట గ్రామపంచాయతీ మూడవ ర్యాంక్ లు
దక్కించుకున్నాయి.