జంట విడిపోతోందంటూ ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. వారిద్దరూ విడాకులకు కూడా
దరఖాస్తు చేసుకున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. వారి గురించిన వార్తలు వైరల్
అయినప్పటికీ ఇద్దరూ ఎక్కడా బయటపడలేదు. బహిరంగంగా ఎప్పుడూ ఎక్కడా ఈ విషయమై
పెదవి విప్పలేదు.
తాజాగా, ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెడుతూ షోయబ్ మాలిక్ స్పందించాడు.
పాకిస్థాన్‌కు చెందిన ‘జియో న్యూస్’ కార్యక్రమం ‘స్కోర్’లో యాంకర్ అడిగిన
ప్రశ్నకు షోయబ్ బదులిస్తూ.. తాము విడిపోతున్నట్టు వస్తున్న వార్తలు ఉత్తవేనని
తేల్చి చెప్పాడు.
‘‘ఇందులో చెప్పడానికేముంది? ఈద్ రోజున ఇద్దరం కలిసి ఉంటే బాగుండేది. కానీ ఆమె
(సానియా) ఐపీఎల్లో షోలతో బిజీగా ఉంది. ఆ కమిట్మెంట్స్ కారణంగానే ఆమె
రాలేకపోయింది. అందుకే ఇద్దరం ఇప్పుడు కలిసి లేం. మేం ఎప్పుడూ ప్రేమను
పంచుకుంటూ ఉంటాం. ఆమెను నేను చాలా కోల్పోతున్నా. మా బంధంపై నేను చెప్పగలిగేది
ఇంతే’’ అని మాలిక్ పేర్కొన్నాడు. రూమర్లను తాము పట్టించుకోబోమని, అందుకే ఆమె
కానీ, తాను కానీ వాటిపై ఇప్పటి వరకు స్పందించలేదని షోయబ్ అన్నాడు.