వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద కిసాన్ డ్రోన్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పౌర
సరఫరాల శాఖలపై సీఎం సమీక్ష
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్
కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు కాకాని
గోవర్ధనరెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, అలాగే సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర
ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రబీలో ఇ– క్రాప్ బుకింగ్‌పై
అధికారులు సీఎంకు వివరాలు అందించారు. 3953 ఆర్బీకే స్థాయి కమ్యూనిటీ హైరింగ్
సెంటర్లు (సీహెచ్‌సీ)లకూ, 194 క్లస్టర్ స్ధాయి సీహెచ్‌సీలకూ మే 20 లోగా
వైయస్సార్ యంత్రసేవ కింద వ్యవసాయ ఉపకరణాలు అందిస్తున్నట్టు అధికారులు
వెల్లడించారు. వైయస్సార్ యంత్రసేవా పథకం కింద జులై నాటికి 500 కిసాన్
డ్రోన్లు, డిసెంబర్ నాటికి 1500కు పైగా డ్రోన్లు ఇచ్చే దిశగా వ్యవసాయశాఖ
చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే, ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే నెలలో
రైతు భరోసా ఇన్స్టాల్మెంట్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని అధికారులను సీఎం
జగన్ ఆదేశించారు. మే 10 నాటికి అర్హులైన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో
ప్రదర్శిస్తామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు.
467 వీఏఏ, 1644 వీహెచ్ఏ, 23 వీఎస్ఏ, 64 వీఎఫ్ఏ పోస్టుల భర్తీకి చర్యలు
తీసుకుంటున్నామని వెల్లడించారు. 4656 ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ల పోస్టుల
భర్తీకీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఖరీఫ్ సీజనల్లో రైతుల దగ్గరనుంచి
సేకరించిన ధాన్యానికి దాదాపుగా చెల్లింపులు పూర్తయ్యాయని,రూ.7233 కోట్లకు గానూ
రూ.7200 కోట్లు చెల్లించినట్లు సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. ఖాతాల్లో
సాంకేతిక పరమైన ఇబ్బందుల కారణంగా రూ.33 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
దీనిపై సీఎం స్పందిస్తూ ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక గోడౌన్ ఉండాలన్న కార్యాచరణ
దిశగా ముందుకు సాగాలని సూచించారు. 1005 చోట్ల గోడౌన్ల నిర్మాణం చేపట్టామని
అధికారులు తెలిపారు. వీటిలో 206కు పైగా పూర్తయ్యాయని, మరో 93 గోడౌన్లు
తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు
చెప్పారు.
వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాలు,
వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ
అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎం వీ యస్ నాగిరెడ్డి, ఏపీ వ్యవసాయశాఖ సలహాదారు ఐ
తిరుపాల్ రెడ్డి, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య
కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్యకార్యదర్శి
చిరంజీవి చౌదరి, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సి హరికిరణ్, అగ్రికల్చర్
మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే, హార్టికల్చర్ కమిషనర్ ఎస్ ఎస్ శ్రీధర్,
పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్
కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ అండ్ వీసీ జి శేఖర్ బాబు, ఏపీ స్టేట్ సివిల్
సఫ్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్ ఎండీ జీ వీరపాండ్యన్ ఇతర
ఉన్నతాధికారులు హాజరయ్యారు.