విజయవాడ : రంజాన్ పండుగ సందర్భంగా వేలాది మంది ముస్లింలకు రంజాన్ తోఫాను ఐజా
గ్రూప్ చైర్మన్, జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి షేక్ గయాజుద్దీన్ పంపిణీ
చేశారు. మూడు రోజులపాటు ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫాను ఐజా అందజేయడం
జరిగింది. ఈ సందర్భంగా గయాజుద్దీన్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో
3000 మందికి రంజాన్ తోఫాను పంపిణీ చేసినట్లు చెప్పారు. పవిత్ర రంజాన్ మాసంలో
ముస్లిం మైనార్టీలు ఎంతో నియమనిష్టలతో అల్లాహ్ ను ప్రార్థించడం
జరుగుతుందన్నారు. రంజాన్ మాసంలో దానధర్మాలు చేయడం ప్రతి ముస్లిం కర్తవ్యం అని
ఆయన అన్నారు. ఇతరులకు సహాయం చేయడం, పేద ముస్లింలను ఆదుకోవడం ఈ మాసం
ప్రత్యేకతగా ఆయన చెప్పారు. అల్లా కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని
ప్రార్థించినట్లు గయాజుద్దీన్ చెప్పారు. రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాల్లో
జనసేన నాయకులు అబ్దుల్ మున్నా, వీరారెడ్డి, షేక్ ఇస్మాయిల్ ,ఐజా గ్రూప్
సభ్యులు సయ్యద్ అలీ, మహబూబ్, జాఫర్, జబ్బర్, రేష్మ, తేజ ,మహాలక్ష్మి తదితరులు
పాల్గొన్నారు. రంజాన్ తోఫా కార్యక్రమంను ఎంతో చక్కగా నిర్వహించిన ఐజా కు
పలువురు ముస్లిం మైనార్టీలు అభినందనలు తెలియజేశారు.