అగ్రశ్రేణి సంగీత దర్శకుడు తమన్ తన మంచి మనసును చాటుకున్నారు. తన ట్రూప్ లోని
ఓ సంగీతకారుడు క్యాన్సర్ తో బాధపడుతుండగా, అతడి కుటుంబానికి తమన్ రూ.10 లక్షల
ఆర్థిక సాయం అందించారు. ఈ విషయాన్ని ప్రముఖ గాయని గీతామాధురి వెల్లడించారు.
ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో తమన్
న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

ఈ కార్యక్రమంలోనే గీతామాధురి… తమన్ చేసిన సాయాన్ని అందరికీ తెలియజేశారు. తమ
మ్యూజిషియన్లలో ఒక కుర్రాడికి క్యాన్సర్ సోకిందని, అతడి ఫ్యామిలీ మెంబర్స్
కీమో థెరపీ చేయించారని గీతామాధురి వెల్లడించారు. అయితే బిల్లు కడితేనే అతడిని
డిశ్చార్జి చేస్తామని ఆసుపత్రి వర్గాలు చెప్పాయని, ఈ విషయం తమన్ గారికి
తెలియడంతో ఆయన వెంటనే రూ.10 లక్షలు అందించారని ఆమె వివరించారు.
కాగా, సామాజిక దృక్పథం ఉన్న తమన్ 100 మంది వృద్ధులకు ఆశ్రయం ఇవ్వగల ఓ
ఆశ్రమాన్ని గుంటూరు వద్ద నిర్మిస్తున్నారు. ఈ వృద్ధాశ్రమం త్వరలోనే ప్రారంభం
కానుందని తమన్ వెల్లడించారు.