న్యూఢిల్లీ : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు లో కీలక పరిణామం
చోటుచేసుకుంది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ అంశంలో తెలంగాణ
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 25 వరకూ
అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర
ఉత్తర్వులను వివేకా కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై
చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ
చేపట్టింది. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ అంశంలో హైకోర్టు ఇచ్చిన
ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఆ ఉత్తర్వులు
ఆమోదయోగ్యమైనవి కాదని అభిప్రాయపడింది. అవినాష్‌కు ముందస్తు బెయిల్ ఇస్తే కేసు
విచారణపై దాని ప్రభావం పడుతుందని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి
తీసుకెళ్లారు. ఈ కేసులో ప్రలోభాలు కూడా పనిచేశాయని చెప్పారు. అనంతరం ధర్మాసనం
స్పందిస్తూ ఈనెల 24న పూర్తిస్థాయి విచారణ చేపడతామని, అప్పుడు అన్ని విషయాలను
పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈనెల 24 వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దని
సీబీఐని ఆదేశించింది. ఈనెల 30లోపు కేసు విచారణ పూర్తిచేయాలంటూ గతంలో తాము
ఇచ్చిన ఆదేశాలను పొడిగిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.