‘ప్రపంచ బౌద్ధ శిఖరాగ్ర సదస్సు లో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ : యుద్ధం, ఆర్థిక అస్థిరత, ఉగ్రవాదం, మతపరమైన తీవ్రవాదం, వాతావరణ
మార్పులు వంటి సవాళ్లను ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటోందని ప్రధాని నరేంద్ర మోడీ
అన్నారు. వీటికి బుద్ధుడి బోధనలే పరిషార్గాన్ని చూపుతాయని చెప్పారు. ఢిల్లీలో
ప్రారంభమైన రెండురోజుల ప్రపంచ బౌద్ధ సదస్సు ప్రారంభ సెషన్లో ఆయన
ప్రసంగించారు. గత శతాబ్దంలో కొన్ని దేశాలు ఇతరుల గురించి, రాబోయే తరాల గురించి
ఆలోచించడం మానేసినందున ప్రపంచం ఇప్పుడు వాతావరణ మార్పుల సంక్షోభాన్ని
ఎదుర్కొంటోందంటూ ధనిక దేశాలపై మోదీ విరుచుకుపడ్డారు. బుద్ధ భగవానుడు చూపిన
మార్గం భవిష్యత్తు, సుస్థిరతల మార్గం అని పునరుద్ఘాటించారు. ప్రపంచం అంతా ఆయన
బోధనలను అనుసరించి ఉంటే..వాతావరణ మార్పు సంక్షోభాన్ని ఎదుర్కొనేది కాదని
ప్రధాని పేర్కొన్నారు. బుద్ధుడి తత్వశాస్త్రం నుంచి ప్రేరణ పొందడం ద్వారా
ప్రజలు, దేశాలు తమ స్వప్రయోజనాలతోపాటు ప్రపంచ ప్రయోజనాలకు ప్రాధాన్య ఇవ్వడం ఈ
కాలపు ప్రధాన అవసరమని స్పష్టం చేశారు. సంతోషకరమైన సుస్థిర ప్రపంచానికి ఇది
మార్గమని చెప్పారు.
యుద్ధాలు, ఆర్థిక అస్థిరత, ఉగ్రవాదం, మతోన్మాదం, వాతావరణ మార్పులు వంటి అనేక
సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రపంచానికి గౌతమ బుద్ధుని బోధనలు పరిష్కారం
చూపిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. యుద్ధాలు, ఆర్థిక అస్థిరత,
ఉగ్రవాదం, మతోన్మాదం, వాతావరణ మార్పులు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న
ప్రపంచానికి గౌతమ బుద్ధుని బోధనలు పరిష్కారం చూపిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ
పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ‘ప్రపంచ బౌద్ధ శిఖరాగ్ర సదస్సు’
ప్రారంభమైంది. దీనిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇతరుల కోసం, రాబోయే తరాల
భవిష్యత్తు కోసం కొన్ని దేశాలు ఆలోచించడం మానేయడం వల్లనే ప్రపంచం ఇప్పుడు
వాతావరణ మార్పుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రధాని విమర్శించారు. ప్రకృతిని
ఎలా చూసినా అది తమపై ప్రభావం చూపించబోదని అనేక దశాబ్దాలుగా ఆ దేశాలు భావిస్తూ,
ఇతర దేశాలపైకి బాధ్యతను నెట్టివేసేవని చెప్పారు. గౌతమ బుద్ధ భగవానుడి బోధనల్ని
ప్రపంచం ఆచరించి ఉంటే వాతావరణ సంక్షోభం ఎదురయ్యేది కాదన్నారు. భవిష్య తరాలకు
సుస్థిరాభివృద్ధిని ఇచ్చేది బుద్ధుని బోధనలేనని చెప్పారు. ‘‘ప్రజలు, ఆయా
దేశాలు తమ సొంత ప్రయోజనాలతో పాటు ప్రపంచం గురించీ పట్టించుకోవడం ప్రస్తుత
తరుణంలో అవసరం. బుద్ధుని తత్వం నుంచి మనం స్ఫూర్తి పొందాలి. సంకుచిత భావాన్ని
పక్కనపెట్టాలి. పేదల కోసం, వనరులు లేని దేశాల కోసం ప్రపంచం ఆలోచించాలి. ప్రపంచ
సంక్షేమానికి ఇలాంటి చొరవను భారత్ చూపిస్తోంది. బుద్ధుని స్ఫూర్తితోనే
మానవాళికి చేయూతనందిస్తోంది’’ అని వివరించారు. యుద్ధాలను కాకుండా బుద్ధుడిని
ప్రపంచానికి భారత్ ఇచ్చిందని చెప్పారు. ఈ సదస్సు ద్వారా ఇతర దేశాలతో దౌత్య,
సాంస్కృతిక బంధాలు బలపడతాయని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు. 30
దేశాల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు.