అమరావతి
ఉద్యోగులను ఈఎంఐ లు ఒకటవతేదీనే కట్టమని ఒత్తిడి చేయవద్దని, పెనాల్టీలు
వేయవద్దని రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు మేనేజర్లకు విజ్ఞప్తులు చేసిన ఏపిజెఏసి
అమరావతి
ఎప్పుడైతేనేం ఉద్యోగులకు జీతం వస్తుంది కదా అని హేళనగా, చులకనగా మాట్లాడటం
యావత్ ఉద్యోగ లోకాన్ని అవహేళన చేయడమే
ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
విజయవాడ : ఏపిజెఏసి రాష్ట్రకమిటి ఇచ్చిన మలిధశ ఉధ్యమకార్యాచరణలో బాగంగా
గురువారం 26 జిల్లాల జిల్లా కేంధ్రాలలో ఉన్న ప్రధానబ్యాంకు మేనేజర్లను కలసి
“ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు/పెన్సన్లు సకాలంలో ప్రభుత్వం
చెల్లించలేక పోతున్నందున ప్రతి నెల ఉద్యోగులు, పెన్షర్లు ఈఎంఐ లు పై వడ్డీ మీద
వడ్డీ రేట్లు వేయకుండా, ఒత్తిడి చేయకుండా వెసులుబాటు కల్పించాలని కోరుతూ”
ప్రధానమైన బ్యాంక్ మేనేజర్లును కలిసే కార్యక్రమాలను విజయవంతంగా జరిగాయని
ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీజెనరల్
పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు,కోశాధికారి
వి.వి.మురళీకృష్టం నాయుడు ద్వారా తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా జీవో ద్వారా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పనిచేసిన
నెల జీతాన్ని “తదుపరి నెల మొదటి రోజునే అనగా ఒకటవ తేదీ” చెల్లించాలని
ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు
“ఎప్పుడైతేనేం జీతం వస్తుంది కదా” అని హేళనగా, చులకనగా మాట్లాడటం చాలా
విచారకరం అని, ఇటువంటి మాటలు యావత్ ఉద్యోగులను అవహేళన చేయడమేనని అన్నారు.
ప్రభుత్వ ఉధ్యోగులకు,పెన్షనర్లకు గత రెండు సంవత్సరాలుగా సకాలంలో జీతాలు,
పెన్షన్లు చెల్లించకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, తద్వారా
ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ అవసరాల కోసం తీసుకున్న బ్యాంక్ లోన్లు సకాలంలో
చెల్లించలేక పోతున్నారని, కనీసం ఇంటి అద్దెలు కూడా సకాలంలో చెల్లించలేక
పోతున్నారని, ఇలాంటి దుస్దితి గతంలో ఎప్పుడు లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం
ఉద్యోగులు ఆర్థికంగా మరియు మనోబావాలు దెబ్బతినకుండా ఉండేలా ఉండాలంటే
జీతాలు,పెన్షన్లు ఒకటవ తేధీన చెల్లించాలని వేయాలని వారు విజ్ఞప్తి చేశారు.