ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు?
నాడు – నేడు పనుల ఒత్తిడి తగ్గించి, విద్యార్దులకు విద్యబోదన పెంచాలి
పిటీడి(ఆర్టీసి) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
అమరావతి : మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 26- జిల్లాలలో ప్రభుత్వం ఇచ్చిన హామి
మేరకు సిపియస్ ను రద్ధుచేసి ఓపియస్ అమలు చేయాలని, ఉపాధ్యయులకు,
ప్రధానోపాధ్యాయులు పై అనవసరమైన యాఫ్స్, నాడు నేడు పనుల ఒత్తిడి, మధ్యాహ్న భోజన
పథకం అమలు తదితర అనవసరపు పనులపై ఒత్తిడి తగ్గించి, విద్యర్దులకు విద్యబోదన
చేసేందుకుటీచర్లకు సమయాన్ని కేటాయించలా చూడాలని, అంతేకాకుండా ఆర్టీసి ఉద్యోగుల
విజ్ఞప్తులు మేరకు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసి పిటిడి ఉద్యోగులగా
గుర్తించిన ఆర్టీసి ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించడంలేదని ఈసమస్యలు
పరిష్కారంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల న్యాయమైన డీమాండ్లు
పరిష్కరించడంలో ఇంకా జాప్యం ఏ మాత్రం మంచిది కాదని ఏపిజెఏసి అమరావతి స్టేట్
చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావులు
అన్నారు.
ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటి ఇచ్చిన మలిధశ ఉద్యమ కార్యచరణలో బాగంగా మంగళవారం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల కార్యలయాలవద్ధ సిపియస్ ఉద్యోగుల,
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కోసం జరిగిన ధర్నాలలో తిరుపతి,చిత్తూరు
జిల్లాలలో చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు, కాకినాడ జిల్లాలలో సెక్రటరీ
జెనరల్ పలిశెట్టి దామోదరరావు, విశాఖపట్నం లో అసోషియేట్ చైర్మన్
టి.వి.ఫణిపేర్రాజు, యన్.టి.ఆర్ జిల్లాలో కోశాధికారి వి.వి.మురళి కృష్ట నాయుడు,
ప్రకాశం జిల్లాలో ఆర్గనైజింగు కార్యదర్శి యస్.కృష్టమోహన్, కడప జిల్లాలో
డాక్టర్ వసంత రాయలు, రాజమండ్రీ జిల్లాలో చేబ్రోలు కృష్ణమూర్తి తదితర రాష్ట్ర
స్థాయిలో 8- టీమ్లు గా ఏర్పడి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ధర్నాలలో
పాల్గొని ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి అవలంబిస్తున్న మొండి
వైఖరి గురించి ఉద్యోగులకు తెలియ చేశారు. పిభ్రవరి 13 న సియస్ గారికి ఇచ్చిన 50
పేజీల మెమోరాండంలో ఉన్న సమస్యలు అన్ని పరిష్కారించాలని లేదంటే ఈ ఉద్యమం
ఇంతటితో ఆగదని భవిష్యత్ లోమరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.