2024 ఎన్నికల్లో పోటీ పైన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తేల్చి చెప్పారు. అదే సమయంలో మంత్రులపైన జనసైనికుల దాడి..అన్ స్టాపబుల్ లో చంద్రబాబు – బాలయ్య వ్యాఖ్యల పైన వంశీ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు -పవన్ తోక పట్టుకొని ఈదాలనుకుంటున్నారని వంశీ వ్యాఖ్యానించారు. మంత్రుల పైన దాడిని ఆయన ఖండించారు. ఆరు శాతం ఓటింగ్ ఉన్న జనసేన దాడి చేస్తే.. 51 శాతం ఓటింగ్ ఉన్న వైసీపీ దాడి చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తన కేడర్ ను అదుపులో పెట్టుకోవాలని వంశీ హెచ్చరించారు.