కొవ్వూరు : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని ప్రాథమిక
వ్యవసాయ పరపతి సంఘాలకు (ఫీఏసీలు) నూతనంగా ఎన్నికైన చైర్ పర్సన్లు రాష్ట్ర హోం
మంత్రి, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డా. తానేటి వనితను మర్యాద
పూర్వకంగా కలిశారు. కాపవరం కోఆపరేటివ్ సోసైటీకి నూతనంగా నియమించిన ఛైర్మన్
సుంకర సత్య నారాయణ, తాడిపూడి కోఆపరేటివ్ సొసైటీకి నూతనంగా నియమించిన చైర్మన్
మండిగ వెంకట గిరిధర్ హోం మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమెను కలిసి
కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా ఎనికైన చైర్మన్లు, సభ్యులకు మంత్రి అభినందనలు
తెలిపారు. నూతన బాధ్యతల ద్వారా రైతులకు, ప్రజలకు మరిన్ని సేవలందించాలని
సూచించారు. ఈ భేటీలో తాడిపూడి సర్పంచ్ నామాల శ్రీనివాస్ (గోపాలం), కాపవరం
సొసైటీ సెక్రటరీ చౌటిపల్లి కృష్ణ పాల్గొన్నారు.