మచిలీపట్నం : జిల్లాలో గంజాయి, మత్తుపదార్థాల వినియోగం, విక్రయాలు, రవాణాను
అరికట్టడానికి ఆయా శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో నార్కోటిక్ కోఆర్డినేషన్
కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. జిల్లాలో మాదకద్రవ్యాల నివారణకు
తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ
సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులుగా కాకుండా తల్లిదండ్రుల స్ధానంలో ఉండి
ఆలోచించాలని, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను యువతకు
తెలియజేయాలన్నారు. విద్యార్ధులు మత్తుపదార్దాల బారిన పడకుండా పాఠశాలలు,
కళాశాలలు వద్ద
అవగాహనా కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా
విద్యాశాఖాధికారిణిని
ఆదేశించారు. విద్యార్ధులకు ఏఏ రోజుల్లో ఎలాంటి అవగాహనా కార్యక్రమాలు
నిర్వహిస్తున్నదీ నివేదికను
తయారుచేసి సమర్పించాలన్నారు. మాదకద్రవ్యాల మూల సరఫరా రవాణాను గుర్తించేందుకు
తెలివిగా
వ్యవహరించాలని, విద్యార్ధులు, ఆటో డ్రైవర్లు, వర్కర్లను లక్ష్యంగా చేసుకుని
సరఫరా జరిగే అవకాశాలు
ఎక్కువగా ఉంటాయని చెప్తూ గట్టి నిఘా ఉంచి విక్రయాలు జరిగే ప్రాంతాలను
గుర్తించాలని, మాదక ద్రవ్యాల బారిన పడిన బాధితుల పట్ల సున్నితంగా
వ్యవహరించాలని పోలీస్ అధికారులకు
సూచించారు. బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు పునరావాసం కల్పించాలని
అన్నారు.
సరఫరాపై సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నెం.15400 ను విద్యా సంస్థలతో పాటు
బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని
మహిళా పోలీసుల ద్వారా దీనిపై
నిఘా ఏర్పాటు చేసుకోవాలని డీఎల్డీఓకు సూచించారు. అక్రమార్కులు గంజాయి సాగు
చేపట్టకుండా జిల్లా అటవీశాఖాధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
యువతపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ప్రత్యక్షంగా అవసరమని, వారి పిల్లల ప్రవర్తనను
నిత్యం గమనించుకుంటూ ఉండాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఎస్పీ పి.జాషువా
మాట్లాడుతూ చల్లపల్లి, పెడన వంటి ప్రాంతాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను
ద్వంసం చేశామని, కొరియర్, ఆర్టీసీ రవాణా పార్సిల్స్పై నిఘా పెంచినట్లు
తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిరోధించడానికి కఠిన
చర్యలు అవలంభిస్తున్నట్లు ఆయన
చెప్పారు. ఎవరైనా మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలు, రవాణా వంటి వాటికి
పాల్పడితే వారి పై
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైక్యోటోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్, 1985 ప్రకారం
కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, బందరు, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ల
అధికారులు ఐ.కిషోర్, విజయ్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా
సుల్తానా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి
డా.జి.గీతాబాయి, జిల్లా అటవీశాఖాధికారి కె.రాజేశేఖరరావు, డ్రగ్స్
నియంత్రణాధికారిణి ఎం.అరుణ, కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమీషనర్
వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి ఎం. విజయ భారతి, డీసీహెచ్ఎస్
డా.ఎస్ ఇందిరాదేవి, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.