పరిమితం కాదని రాష్ట్ర హోంమంత్రి, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి
డా.తానేటి వనిత తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 132వ జన్మదినాన్ని
పురస్కరించుకుని కొవ్వూరు నియోజకవర్గంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో ఆమె
ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా హోంమంత్రి వారి కార్యాలయంలో డాక్టర్
బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం
కొవ్వూరు పట్టణంలోని ఒకటో వార్డు, నాలుగో వార్దు, బస్టాండ్ సెంటర్, 14వ
వార్డు, బ్రిడ్జిపేటలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి
నివాళులర్పించారు. అనంతరం మల్లవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్
భవనాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
జయంతి అంటే భారతీయులందరికీ కూడా ఒక పండగ లాంటిదన్నారు. భరతజాతికి ఆయన అందించిన
సేవలను కొనియాడారు. సమాజంలో అందరూ సమానత్వంతో స్వేచ్ఛగా జీవించడానికి భారత
రాజ్యాంగాన్ని బహుమతిగా ఇచ్చారన్నారు. అంబేద్కర్ చిన్ననాటి నుండి ఎన్నో
అవమానాలను, అవహేళనలను ఎదుర్కొంటూ విద్యను అభ్యసించారని ఆనాటి పరిస్థితుల్ని
వివరించారు. కుల వివక్షతను ఎదుర్కొంటూ కూడా కష్టపడి చదువుకుని ప్రపంచంలో ఎవరూ
సాధించలేనన్ని డిగ్రీలు సాధించారని తెలిపారు. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో అందరూ
బ్రతకాలి, సమాజంలో సమానత్వం తీసుకురావాలని రాజ్యాంగాన్ని మనకు బహుమతిగా
ఇచ్చారని తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని
తెలిపారు. అమ్మబడి, ఇంగ్లీష్ మీడియం చదువులు వంటి విద్యా సంస్కరణలతో పేద
బిడ్డలను సైతం విద్యకు మరింత చేరువ చేశారన్నారు. హోంమంత్రి హోదాలో తాను ఈ
కార్యక్రమాలల్లో పాల్గొనడానికి కారణం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం,
రాష్ట్రంలో ఆయన ఆశయాలను అమలు చేస్తున్న జగనన్నే కారణమన్నారు. అంబేద్కర్
అందరివాడనే, ఒక కులానికి ఒక మతానికి ఆపాదించొద్దని యువతకు మంత్రి తానేటి వనిత
సూచించారు.