హైదరాబాద్ : ప్రస్తుతం అభివృద్ధిలో దేశానికి తెలంగాణ కొత్త దారి చూపుతోందని
బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ పేర్కొన్నారు. అలాగే దేశానికి రెండో
రాజధానిగా హైదరాబాద్నే ఉండాలనే అంబేడ్కర్ ఆశయం నెరవేరలేదన్నారు. హైదరాబాద్లో
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.
దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్నే ఉండాలనే బీఆర్ అంబేడ్కర్ ఆశయం
నెరవేరలేదని ఆయన ముని మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ తెలిపారు. హైదరాబాద్లోని
హుస్సేన్ సాగర్ వద్ద నెలకొల్పిన 125 అడుగుల బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన రాజ్యాంగ నిర్మాత ఆశయాల, కీర్తిని గురించి
ప్రసగించారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు
పాల్గొన్నారు.
బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్కు ముందుగా
శుభాకాంక్షలు తెలుపుతున్నానని ప్రకాశ్ అంబేడ్కర్ పేర్కొన్నారు. సమాజంలో మార్పు
కోసం ఆయన భావజాలం ఎంతో అవసరమని, తన ఆదర్శాలను పాటించడమే మనం అందరం ఇచ్చే
నిజమైన నివాళి అని తెలిపారు. స్వాతంత్య్రం రాక ముందు ఆంగ్లేయులు భారతావనిని ఏ
విధంగా దోచుకున్నారో గ్రహించి 1923లోనే రూపాయి సమస్యపై ఒక పరిశోధన పత్రాన్ని
రాశారని కొనియాడారు.అంటరానితనాన్ని పారద్రోలడానికి బీఆర్ అంబేడ్కర్ ఎంతగానో
కృషి చేశారని ప్రకాశ్ అంబేడ్కర్ వివరించారు. నవ భారతంలో కొన్ని అతిచిన్న
కులాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. ఆర్థిక దుర్భలత్వంపై
పోరాడేందుకు ఇక్కడి సీఎం కృషి చేస్తున్నారని కొనియాడారు. అలాగే రాజ్యాంగ
నిర్మాత ఆశయాలను కూడా కేసీఆర్ ముందుకు తీసుకెళుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ గురించి ఆనాడే చెప్పిన రాజ్యాంగ రూపశిల్పి
చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు ముందుగా అంబేడ్కర్ మద్దతిచ్చారని ఆయన మనువడు
గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం
చేశారన్నారు. ఆయన ప్రాణ త్యాగం చేసేవరకు సమస్య పరిష్కరించలేదని మండిపడ్డారు.
తెలంగాణ కోసం కూడా ఎంతో పోరాటం జరిగిందన్నారు. రూపాయి బలోపేతం, దాని ఆవశ్యకతను
ఆనాడే అంబేడ్కర్ నొక్కి చెప్పారని తెలియజేశారు. దేశానికి రక్షణ సమస్య వస్తే
మరో రాజధాని అవసరమని అందుకు హైదరాబాద్నే సరైందని చెప్పారు. ఎందుకంటే పాక్,
చైనా నుంచి భాగ్యనగరం ఎంతో దూరంలో ఉందని భావించి ఆనాడే ఎంతో దూరదృష్టితో
ఆలోచించారన్నారు.
తెలంగాణ దేశానికి కొత్త దారి చూపింది
ప్రస్తుతం దేశంలో జాతీయ నాయకులు కరువయ్యారన్నారు. వాజ్పేయి వంటి జాతీయ నాయకులు
కనిపించట్లేదని ఆవేదన చెందారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికి కొత్తదారి
చూపించిందన్నారు. జాతి, ధర్మాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలని బీఆర్ అంబేడ్కర్
ముని మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ కోరారు.
“దళితబంధును ప్రారభించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు. ఆర్ధిక
దుర్భలత్వంపై ఎలా పోరాడాలో దేశానికి ఒక మార్గం చూపారు. పేదరిక నిర్మూలన కోసం
ఉద్దేశించిన ఈ కార్యక్రమం.. కొత్త దిశ చూపించింది. అంబేడ్కర్ జయంతి రోజు ఆయన
ఆర్ధిక ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు కేసీఆర్కు మరోసారి కృతజ్ఞతలు
తెలిపారు.