మచిలీపట్నం : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ అణగారిన వర్గాల
బాగు కోసం తన జీవితాన్ని ధారపోసిన గొప్ప ఆదర్శ మూర్తని రాష్ట్ర గృహ నిర్మాణ
శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ
జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన గూడూరు గ్రామం, పెడన మండలలోని తోటమూల
గ్రామం, పెడన మున్సిపల్ కార్యాలయం, వైసీపీ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్
అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు తనయుడు జోగి రాజీవ్, స్థానిక
ప్రజాప్రతినిధులతో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా
మంత్రి మాట్లాడుతూ బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం
బడుగు బలహీన వర్గాల సామాజిక ఆర్థిక స్థితిగతులను మార్చిందని, అంతటి గొప్ప
మహనీయుడు దేశంలో పుట్టటం భారతీయుల అదృష్టమని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య
వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి కారణం ఆయన రూపొందించిన రాజ్యాంగమే మూల స్తంభం అని
పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో విఫలమైన దేశాలు, గొప్ప మేదస్సు, విద్య కలిగిన
అంబేద్కర్ వంటి మనిషి తమ దేశాలలో పుట్టాలని కోరుకుంటున్నారు అంటే అందుకు కారణం
తన రచనతో దేశానికి దిశా నిర్దేశం చేసిన రాజ్యాంగమేనని మంత్రి అన్నారు. ఎస్సీ,
ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఆయన ఒక స్పూర్తి, దేవుడు అని, వారి ఎదుగుదలకు
ఎంతో కృషి చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ఆయన అడుగుజాడలలో
నడవడానికి కృషి చేద్దామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పెడన మున్సిపల్
చైర్ పర్సన్ బళ్లా జ్ఞాన లింగ జ్యోత్స్న రాణి, వైస్ ఛైర్మెన్లు ఎం.డి. ఖాజా,
బైలపాటి జ్యోతి, జెడ్పీటీసీ వేముల సురేష్ రంగబాబు, మున్సిపల్ కమిషనర్
ఎం.అంజయ్య, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు,
మండల పట్టణ వైసిపి అధ్యక్షులు తలుపుల వెంకట కృష్ణారావు, బండారు
మల్లిఖార్జునరావు, పెడన మునిసిపాలిటీ ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, కౌన్సిలర్లు,
స్థానిక ప్రజా ప్రతినిధులు, వైయస్సార్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది,
ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.